ఈ ఏడాది మోక్షజ్ఞ ఎంట్రీ.. పక్కా ?

19
- Advertisement -

నటసింహ నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ సినీ ఎంట్రీ కోసం నందమూరి అభిమానులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నారు. సీనియర్ హీరోల తనయులలో మోక్షజ్ఞ ఎంట్రీ కోసం జరుగుతున్నంత వెయిటింగ్ మరే ఇతర స్టార్ హీరో తనయుడి ఎంట్రీకి జరగలేదేమో. ఎన్నో ఏళ్లుగా మోక్షజ్ఞ ఎంట్రీ ఇదిగో అదిగో అంటూ ఎప్పటికప్పుడు వాయిదా పడుతూనే వచ్చింది. ఒకానొక సందర్భంలో మోక్షజ్ఞకు అసలు సినిమాలంటే ఇష్టం లేదని, సినీ ఎంట్రీ ఇచ్చేందుకు ఆసక్తి లేదని కూడా వార్తలు వచ్చాయి. అదే టైమ్ లో మోక్షజ్ఞ విపరీతంగా బరువు పెరగడంతో నిజంగానే మొక్షు సినీరంగానికి దూరమేనా అని నందమూరి అభిమానులు సైతం అసహనానికి లోనయ్యారు. అయితే తన తనయుడి సినీ ఎంట్రీ ఖచ్చితంగా ఉంటుందని బాలయ్య తరచూ చెబుతూనే వస్తున్నారు. .

బాలయ్య 100 సినిమాతోనే మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుందనే వార్తలు వినిపించాయి. కానీ జరగలేదు. ఇకపోతే ప్రస్తుతం మోక్షజ్ఞ పూర్తిగా బరువు తగ్గి పర్ఫెక్ట్ హీరో మెటీరీయల్ గా మారాడు. ప్రస్తుతం మోక్షజ్ఞ బరువు తగ్గిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. దాంతో ఈ ఏడాది మోక్షజ్ఞ ఎంట్రీ పక్కాగా ఉండనుందని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే మోక్షజ్ఞను లాంచ్ చేసే బాధ్యత ఏ డైరెక్టర్ తీసుకుంటడనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఆ మధ్య బాలయ్యనే స్వయంగా డైరెక్టర్ గా మరి కొడుకును లాంచ్ చేస్తాడనే వార్తలు కూడా వినిపించాయి. అయితే డెబ్యూ మూవీని స్టార్ డైరెక్టర్ తో చేయిస్తే మేలని భాలయ్య భావిస్తున్నారట. అందులో భాగంగానే పూరీ జగన్నాథ్, అనిల్ రావిపూడి, బోయపాటి శ్రీను వంటివారి పేర్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి. మరి ఈ దర్శకులలో ఎవరు మోక్షజ్ఞను లాంచ్ చేసే ఛాన్స్ కొట్టేస్తారో చూడాలి. మొత్తానికి ఈ ఏడాది మోక్షజ్ఞ ఎంట్రీతో నందమూరి అభిమానుల కల నెరవేరే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Also Read:Vishal:ఎనిమిది కోట్లు వద్దన్న విశాల్

- Advertisement -