AP:ప్రధాని పర్యటనకు ఏర్పాట్లు పూర్తి

14
- Advertisement -

ప్రధాని మోదీ పర్యటనకు ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయి అని తెలిపారు ఏపీ మంత్రి నారాయణ. వర్షం వస్తే పార్కింగ్‌కు ఇబ్బంది లేకుండా ప్రత్యామ్నాయం చూడాలని సీఎం సూచించారు అని తెలిపారు.

దీనిపై పోలీసు అధికారులకు ఆదేశాలు జారీ చేశాం అని తెలిపారు నారాయణ. 3000 బస్సులు, 1000 కార్లకు పార్కింగ్ ఏర్పాట్లు చేశాం అన్నారు.ప్రోటోకాల్ ప్రకారం అందరికీ ఆహ్వానం పలుకుతున్నాం అని చెప్పారు. అన్ని శాఖలు సమన్వయంతో ముందుకు వెళ్తున్నాయి అని చెప్పారు.

మే 2వ తేదీన మధ్యాహ్నం 3గంటలకు ప్రధాని నరేంద్ర మోదీ గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్ లో మధ్యాహ్నం 3.30 గంటలకు అమరావతిలోని హెలిప్యాడ్ కు చేరుకుంటారు.

3.45గంటలకు అమరావతి పెవిలియన్ ను సందర్శిస్తారు. సాయంత్రం 4గంటల నుంచి 5గంటల వరకు అమరావతి రాజధాని నిర్మాణ పనులు పున: ప్రారంభంతోపాటు బహిరంగ సభలో పాల్గొంటారు. సాయంత్రం 5గంటలకు అమరావతి ప్రాంతం నుంచి తిరిగి పయణమవుతారు. సాయంత్రం 5.10 గంటలకు హెలికాప్టర్ లో బయల్దేరి గన్నవరం విమానాశ్రయానికి వెళ్తారు. గన్నవరం నుంచి బయల్దేరి 5.20గంటలకు ఢిల్లీకి బయలుదేరుతారు.

Also Read:చార్‌ధామ్ యాత్ర ప్రారంభం..

- Advertisement -