- Advertisement -
తెలుగు, కన్నడ ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు మాలాశ్రీ. ఒకప్పుడు హీరోయిన్‌గా వెలుగు వెలిగిన మాలాశ్రీ ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటోంది. అయితే తాజాగా ఆమె కూతురు రాధన హీరోయిన్‌గా ఎంట్రీకి సిద్ధమైంది. కన్నడ హీరో దర్శన్ 56వ సినిమాలో రాధన హీరోయిన్ గా నటించబోతోంది.
ప్రముఖ నిర్మాత రాక్‌లైన్ వెంకటేష్ తన రాక్‌లైన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ సినిమాని పాన్ ఇండియా వైడ్ తెలుగు,కన్నడ , మలయాళం, తమిళం, హిందీ భాషల్లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
ఈ సందర్భంగా మాలాశ్రీ మాట్లాడుతూ.. రాధనాకు శుభాకాంక్షలు. నన్ను ఎలా ఆదరించారో ప్రేక్షకులు ఆమెని కూడా ఆదరించాలి. రాక్‌లైన్ నా సినిమాతో ప్రొడక్షన్‌లోకి అడ్డుపెట్టి ఇప్పుడు నా కూతుర్ని నటిగా పరిచయం చేస్తున్నారు అన్నారు. తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలని ఆకాంక్షించారు.
- Advertisement -