మహా కుంభమేళా కు ప్రయాగ్‌రాజ్ సిద్ధమవుతోంది. జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు 45 రోజుల పాటు నిర్వహించనున్న ఈ ఉత్సవానికి ప్రపంచవ్యాప్తంగా దాదాపు 40 కోట్ల మంది వస్తారని అంచనా. ఈ నేపథ్యంలో అధికారులు పెద్దఎత్తున ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సైతం తన ‘మన్‌కీ బాత్’లో మహా కుంభమేళాను ప్రస్తావించారు. దీన్ని ఐక్యతా మేళాగా పేర్కొన్నారు. ఆధ్యాత్మికత, సంస్కృతి, భద్రత, ఆధునికతల మేళవింపుగా ఈ వేడుకను నిర్వహించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు సాంస్కృతిక శాఖ తెలిపింది. దీనికి సంబంధించిన వివరాలను వెల్లడించింది.
భద్రత కోసం పారామిలిటరీ బలగాలు సహా 50 వేల మంది సిబ్బంది మోహరించారు. కృత్రిమ మేధ సాంకేతికతతో కూడిన 2700 కెమెరాల ఏర్పాటు.. తొలిసారి అండర్‌వాటర్ డ్రోన్ల వినియోగిస్తున్నారు. పోలీస్ స్టేషన్‌లలో సైబర్ హెల్ప్ డెస్క్‌లు, 56 మంది సైబర్ వారియర్ల బృందం అందుబాటులో ఉండగా కుంభమేళా సమాచారం తెలుసుకునేందుకు 11 భారతీయ భాషల్లో ఏఐ చాట్‌బాట్ అందుబాటులో ఉంది.
Also Read:బడుగుల గళం పీజేఆర్: సీఎం రేవంత్ రెడ్డి