ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా జగన్ ప్రమాణస్వీకార కార్యక్రమానికి ఏర్పాట్లు పూర్తయ్యాయయి. ఈనెల 30న మధ్యాహ్నం 12.23 గంటలకు విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.ఇక జగన్ ప్రత్యేకంగా తయారు చేసిన వాహనంలో ప్రజలకు అభివాదం చేయనున్నారు.
జగన్ ప్రమాణస్వీకార కార్యక్రమం వేదిక దగ్గరికి పాస్ లు ఉన్నవారికి అనుమతి ఇవ్వనున్నారు.దాదాపు 5 వేల మందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. అంతేకాకుండా ట్రాఫిక్‌కు ఎటువంటి అంతరాయం కలగకుండా ఉండేందుకు పలుచోట్ల వాహనాల దారి మళ్లింపు చేపట్టారు.
ఈ వేడుకకు హాజరుకానున్న గవర్నర్ నరసింహన్, తెలంగాణ సీఎం కేసీఆర్ క్వానాయ్ కోసం ప్రత్యేక మార్గాలు ఏర్పాటు చేశారు. అలాగే ఎంపీ, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధుల కోసం మరో మార్గం సిద్దం చేస్తున్నారు. ప్రజాప్రతినిధుల వాహనాల పార్కింగ్ కోసం ఏఆర్ మైదానం కేటాయించారు.