వెస్టిండీస్‌తో సిరీస్‌..హార్ధిక్ రీఎంట్రీ!

93
hardik
- Advertisement -

త్వరలో జరిగే వెస్టిండీస్‌ సిరీస్‌తో రీఎంట్రీ ఇవ్వనున్నారు ఆల్‌రౌండర్ హార్ధిక్ పాండ్యా. ఇప్పటికే నెట్స్‌లో బౌలింగ్ ప్రాక్టీస్ చేస్తున్న హార్ధిక్..రీఎంట్రీ ఖాయం కానుంది. అదేవిధంగా గాయం కారణంగా దక్షిణాఫ్రికా పర్యటనకు దూరమైన రోహిత్ శర్మ.. త్వరలోనే బెంగళూరులో ఫిట్‌నెస్‌ టెస్టుకు హాజరైన తర్వాత జట్టులోకి అడుగుపెట్టనున్నాడు.

టీ20 ప్రపంచకప్‌ టోర్నీ తర్వాత హార్దిక్‌కు విశ్రాంతి ఇవ్వలేదు. తనను జట్టు నుంచి తప్పించారు. వైఫల్యం కారణంగా గడ్డు పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందన్న వాస్తవాన్ని అతడికి తెలియజేసేందుకే సెలక్టర్లు ఇలా చేశారు. నిజానికి తను మంచి ఆటగాడు. పూర్తిస్థాయిలో దృష్టి సారిస్తే తప్పక రాణిస్తాడు. వెస్టిండీస్‌తో లేదంటే… శ్రీలంకతో సిరీస్‌తో అతడు పునరాగమనం చేయడం తథ్యం అని బీసీసీఐ అధికారులు వెల్లడించారు.

- Advertisement -