GSLV-F16 ప్రయోగం..అప్‌డేట్

8
- Advertisement -

రేపు శ్రీహరికోట నుంచి మరో ప్రతిష్టాత్మక ప్రయోగంకు సిద్ధమైంది. శ్రీహరికోట నుంచి నైసార్‌ ఉపగ్రహ ప్రయోగాన్ని ప్రయోగించనున్నారు. సాయంత్రం 5:40 గంటలకు GSLV-F16 ద్వారా ప్రయోగం చేపట్టనున్నారు.

రూ.11,200 కోట్లతో నాసా, ఇస్రో ఉమ్మడిగా ప్రయోగం చేపట్టనున్నారు. అత్యంత ఖరీదైన భూపరిశీలన ఉపగ్రహంగా నైసార్‌ రికార్డు కొల్పనుంది. శ్రీహరికోటలోని సతీశ్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ నుంచి ఈ నెల 30న సాయంత్రం 5:40 గంటలకు నిసార్‌ ఉపగ్రహాన్ని ప్రయోగించనున్నారు.

2,392 కిలోల బరువున్న ఈ శాటిలైట్‌ను జీఎస్‌ఎల్వీ ఎఫ్‌-16 రాకెట్‌ ద్వారా కక్ష్యలోకి పంపించనున్నారు. ఈ ఉపగ్రహ ప్రయోగం కోసం ఎస్‌డీఎస్‌ఎస్‌లో అన్ని ఏర్పాట్లు చేశారు.

Also Read:ప్రజా ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి: పొన్నం

- Advertisement -