చేప ప్రసాదం.. 32 కౌంటర్లు

119
- Advertisement -

హైదరాబాద్ చేప ప్రసాదం పంపిణీ గురించి తెలియని వారుండరూ. ప్రతి ఏటా మృగశిర కార్తె సందర్భంగా చేప ప్రసాదం పంపిణీ పెద్ద ఎత్తున జరగుతుంది. తెలుగు రాష్ట్రాలతో పాటు వివిధ ప్రాంతాల నుండి పెద్ద ఎత్తున ప్రజలు ఈ చేప ప్రసాదాన్ని తీసుకునేందుకు తరలివస్తారు. చేప ప్రసాదం పంపిణీ కార్యక్రమాన్ని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ ప్రారంభించారు.

బత్తిని సోదరులు పంపిణీ చేసే చేప ప్రసాదానికి 173 ఏళ్ల చరిత్ర ఉంది.  ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేశారు. దాదాపు 32 కౌంటర్ల ద్వారా చేప ప్రసాదాన్ని పంపిణీ చేస్తున్నారు.

Also Read:బీసీల్లోని వృత్తికులాలకు ఆర్థికసాయం..

చేపప్రసాదం పంపిణీకి ఏర్పాటు చేసిన క్యూలైన్లలో ఇప్పటికే ప్రజలు బారులు తీరారు. ఉబ్బస వ్యాధిగ్రస్తులు, వారి సహాయకులు భారీగా తరలిరావడంతో గ్రౌండ్ నిండిపోయింది. మైదానికి చేరుకున్న వారికి ఫలహారాలు, భోజన సదుపాయాలు కల్పించేందుకు స్వచ్ఛంద సంస్థలు ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేశాయి. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఉండేందుకు ప్రభుత్వ శాఖల అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు.

Also Read:అన్ స్టాపబుల్ ఎంటర్ టైనర్: చిత్ర యూనిట్

- Advertisement -