తొలివిడతలో 71 మంది ఏకగ్రీవం

239
trs
- Advertisement -

స్థానిక సంస్థల ఎన్నికల సమరంలో భాగంగా తొలి విడత ఎన్నికల ప్రచారానికి నేటితో తెరపడనుంది. మొదటి విడతలో 195 జడ్పీటీసీ,2097 ఎంపీటీసీ స్ధానాలకు ఎన్నికలు జరగనుంది. 6వ తేదీన ఎన్నికలు జరగనుండగా ఎన్నికలయ్యే ప్రాంతాల్లోని మద్యం దుకాణాలను పోలింగ్‌ ముగిసే వరకు తెరవకూడదని ఎన్నికల సంఘం ఆదేశించింది. టీవీలు, పేపర్లు,సోషల్ మీడియాలో ప్రచారం చేయడానికి వీలు లేదని తెలిపింది ఈసీ. నిబంధనలు ఎవరు అతిక్రమించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

ఇక మరోవైపు స్ధానిక ఎన్నికల్లో ఏకగ్రీవాల పరంపర కొనసాగుతూనే ఉంది. తొలివిడతలో 69 ఎంపీటీసీ, రెండు జడ్పీటీసీ స్థానాల్లో సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.నిజామాబాద్‌, జగిత్యాల జిల్లాల్లో రెండు జడ్పీటీసీలు ఏకగ్రీవం కాగా ఈ రెండు స్ధానాలను టీఆర్ఎస్ కైవసం చేసుకుంది.

69 మంది ఎంపీటీసీ సభ్యులు ఏకగ్రీవం కాగా, వీరిలో 67 మంది టీఆర్ఎస్, ఇద్దరు కాంగ్రెస్‌ పార్టీకి చెందిన వారున్నారు. అత్యధికంగా సిద్దిపేట జిల్లాలో 10 ఎంపీటీసీ స్థానాల్లో సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎంపీటీసీ స్ధానాలకు సంబంధించి ఏడు జిల్లాల్లో ఒక్క స్థానం కూడా ఏకగ్రీవం కాలేదు.

- Advertisement -