దేశ రాజధాని ఢిల్లీ సీఎం ప్రమాణ స్వీకారానికి ముహుర్తం ఖరారైంది.అయితే సీఎం ఎవరనేది బీజేపీ అధిష్టానం ప్రకటించకపోయినా 15 మంది ఎమ్మెల్యేలతో జాబితాను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. వీరి నుండే సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులు, స్పీకర్‌ను ఖరారు చేసే అవకాశం ఉంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అమెరికా పర్యటన ముగించుకుని భారత్‌కు వచ్చిన తర్వాత సీఎం ఎవరనేది ప్రకటించనున్నారు. లో ఉన్న విషయం తెలిసిందే. ఈ పర్యటన ముగించుకొని ఇవాళ రాత్రికి లేదా రేపు ఉదయానికి ఢిల్లీ చేరుకునే అవకాశం ఉంది.
ఈ నెల 17, 18 తేదీల్లో శాసనసభా పక్ష సమావేశం ఏర్పాటు చేసి సీఎం అభ్యర్థిని ఎన్నుకోనున్నారు. 19, 20 తేదీల్లో సీఎం ప్రమాణ స్వీకారం ఉంటుందని జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఇక సీఎం రేసులో ప్రధానంగా పర్వేశ్ వర్మ,రమేశ్ బిధూరి,బన్సూరి స్వరాజ్,స్మృతి ఇరానీ పేర్లు వినిపిస్తున్నాయి.
Also Read:వెనక్కి రావాల్సిందే..అక్రమ వలసదారులపై మోదీ
మొత్తం 70 స్థానాలున్న ఢిల్లీ అసెంబ్లీలో బీజేపీ 48, ఆప్ 22 స్థానాలను గెలుచుకున్న సంగతి తెలిసిందే.