చంద్రబాబు కు బెయిల్.. రెడీ?

33
- Advertisement -

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పై వివిధ రకాల స్కామ్ లు చుట్టూ ముట్టిన సంగతి తెలిసిందే. స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ లో ఇప్పటికే అయిన జైల్లో ఉన్నారు. ఇది మాత్రమే కాకుండా ఫైబర్ గ్రేడ్ స్కామ్, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ స్కామ్, అంగళ్ళు.. ఇలా పలు రకాల కేసుల్లో ఆయన నిందితుడిగా ఉన్నారు. గత కొన్నాళ్లుగా ఈ కేసులపై కోర్టుల్లో విచారణ జరుగుతుండగా ఎప్పటికప్పుడు ఆయనకు నిరాశే ఎదురవుతోంది. ఫలితంగా ఆయనకు బెయిల్ వస్తుందా రాదా అనే అనుమానాలు వ్యక్తమౌతు వచ్చాయి. ఒకానొక దశలో ఆయన బయటకు రావడం కూడా కష్టమే అనే భావనా కూడా కలిగింది.

అయితే తాజాగా బుదవారం హైకోర్టు విచారణలో అమరావతి రింగ్ రోడ్ స్కామ్ విషయంలో ఆయనకు తాత్కాలిక ఊరట లభించింది. మద్యంతర బెయిల్ మంజూరు చేస్తూ ధర్మాసనం తీర్పునిచ్చింది. అంగళ్ళు కేసులో కోర్టు ఆదేశాలు వచ్చే వరకు అరెస్ట్ చేయరాదని సీఐడీని ఆదేశించింది ధర్మాసనం. అలాగే ఏసీబీ కోర్టులోని పీటీ వారెంట్లపై కూడా స్టే విధించింది. దీంతో టీడీపీ శ్రేణులు కొంతవరకు ఊపిరి పిల్చుకున్నారు. ఇక స్కిల్ స్కామ్ లో ఈ నెల 19 వరకు ఏసీబీ కోర్టు రిమాండ్ పొడిగించిన సంగతి తెలిసిందే.

Also Read:బూతుల కోసం థియేటర్స్ కి రావాలా?

దాంతో ఈ నెల 19న కోర్టు ఏసీబీ కోర్టు ఎలాంటి తీర్పు ఇబ్బబోతుంది అనేది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం చంద్రబాబు చుట్టూ ఉన్న కేసుల్లో ఒక్కో దానికి బెయిల్ వచ్చినప్పటికి మళ్ళీ ఏదో ఒక కేసులో బెయిల్ దొరకడం కష్టమేనని, అలా చూస్తే ఆయన ఎన్నికల సమయానికి కూడా బయటకు వచ్చే అవకాశాలు తక్కువ అనేది కొందరు విశ్లేషకులు చెబుతున్నా మాట. మొత్తానికి రింగ్ రోడ్ స్కామ్ లో కొంత ఊరట లభించడం టీడీపీని ఖుషీ చేసే అంశమే. ఇక మిగిలిన కేసుల్లో బాబుకు ఎప్పుడు పూర్తి బెయిల్ వస్తుందో మరి.

Also Read:పిక్ టాక్ : నిలువెత్తు అందాలతో దాడి

- Advertisement -