రేవంత్ ప్రమాణస్వీకారం..ముహుర్తం ఫిక్స్

38
- Advertisement -

తెలంగాణ కొత్త సీఎంగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చకచక జరుగుతున్నాయి. సీఎంగా రేపు 1.04 గంటలకు ప్రమాణ స్వీకారం చేయనుండగా ఇందుకు ఎల్బీ స్టేడియం ముస్తావుతోంది. ఇప్పటికే ఏర్పాట్లను అటు అధికారులు, ఇటు కాంగ్రెస్ నేతలు పరిశీలించారు. ఇక రేవంత్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి భారీ జనసమీకరణకు ప్లాన్ చేస్తున్నారు.

ఇక ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న రేవంత్ కాంగ్రెస్ అగ్రనేతలతో వరుస భేటీలు జరుపుతున్నారు. ఇవాళ సాయంత్రం హైదరాబాద్ చేరుకోనుండగా ఎంపీ పదవికి రాజీనామా చేసే అవకాశం ఉంది. ఇక కేబినెట్ కూర్పుపై కాంగ్రెస్ అధిష్టానంతో చర్చించనున్నారు రేవంత్. రాహుల్, సోనియా, ప్రియాంక, కేసీ వేణుగోపాల్ తో భేటీ అవుతారు. సీఎంగా అవకాశం కల్పించినందుకు రేవంత్ వారికి కృతజ్ఞతలు తెలియజేయనున్నారు.

Also Read:ఈగల్..ఊర మాస్ అంథమ్

- Advertisement -