బీఆర్ఎస్ మీటింగ్‌కు ఖమ్మం ముస్తాబు..

27
- Advertisement -

18న(రేపు) జరిగే బీఆర్ఎస్ మీటింగ్‌కు ఖమ్మం ముస్తాభైంది. జాతీయ పార్టీగా ఆవిర్భవించిన అనంతరం జరుగుతున్న బీఆర్ఎస్ తొలి మీటింగ్‌ కావడంతో ప్రతిష్టాత్మకంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. 100 ఎకరాల్లో సభ, 448 ఎకరాల్లో పార్కింగ్ కు ఏర్పాట్లు చేశారు. సభ కోసం వెయ్యి మంది వాలంటీర్లను అందుబాటులో ఉంచారు.

ఖమ్మం 13 నియోజకవర్గాల నుంచి ఎక్కువగా జన సమీకరణ చేస్తుండగా సభకు సంబంధించిన స్టేజ్ ని జర్మన్ టెక్నాలజీతో ఏర్పాటు చేశారు. మొత్తం 200 మంది వీవీఐపీలు కూర్చునే విధంగా వేదికను తీర్చిదిద్దబోతున్నారు.

బీఆర్ఎస్ పార్టీ హోర్డింగులు, కటౌట్లతో గులాబీమయమైంది. నియోజకవర్గాల వారీగా వారికి కేటాయించిన స్థలంలో పార్కింగ్ చేసేలా డ్రైవర్లకు క్యూఆర్ కోడ్ ఇస్తున్నారు. ముఖ్య అతిథులతో పాటు ఖమ్మం జిల్లా ప్రజా ప్రతినిధులు, నేతలు వేదికపై ఉండనున్నారు.

ఇవి కూడా చదవండి..

- Advertisement -