BRS:రజతోత్సవ వేడుకలకు డల్లాస్ సిద్ధం

7
- Advertisement -

బీఆర్‌ఎస్‌ పార్టీ 25ఏళ్ల విజయవంతమైన ప్రస్థానాన్ని పురస్కరించుకొని, జూన్ 1, 2025 న అమెరికాలోని డల్లాస్ నగరంలోని DR Pepper Arena వేదికగా బీఆర్‌ఎస్‌ రజతోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించబోతున్నట్లు బీఆర్‌ఎస్‌ గ్లోబల్ ఎన్ఆర్ఐ కోఆర్డినేటర్ మహేష్ బిగాల తెలిపారు.

ఈ సందర్భంగా డల్లాస్ నగరాన్ని సందర్శించిన బీఆర్‌ఎస్‌ గ్లోబల్ ఎన్ఆర్ఐ కోఆర్డినేటర్ మహేష్ బిగాల, యూఎస్ఏ అడ్వైజరీ బోర్డు చైర్మన్ తన్నీరు మహేష్, స్థానిక బీఆర్‌ఎస్‌ నేతలు, అభిమానులతో సమావేశమై, రాబోయే కార్యక్రమాల Dr Pepper Arena Comerica Center లో ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ వేడుకలో ముఖ్య అతిథిగా బీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు హాజరుకానున్నారని మహేష్ బిగాల వెల్లడించారు.

ఇది ఓ వేడుకే కాకుండా, తెలంగాణ ఉద్యమ ఆత్మను ప్రపంచానికి వినిపించే గొప్ప వేదికగా మారనుంది. ఉత్సవాల్లో భాగంగా తెలంగాణ సాంస్కృతిక కళాపరిషత్‌ ఆధ్వర్యంలో ఆకట్టుకునే సాంస్కృతిక కార్యక్రమాలు, ఆట పాటలతో కళాకారుల ప్రదర్శనలు జరగనున్నాయి.ఈ మహాసభకు యూఎస్ఏలోని తెలంగాణ, తెలుగు ప్రజలు, బీఆర్‌ఎస్ మద్దతుదారులు, ఇతర తెలంగాణ సంఘాలు పెద్ద సంఖ్యలో హాజరవుతారని అన్ని సంఘాలు మద్దతు తెలిపాయి అని అన్నారు.

బీఆర్‌ఎస్ యూఎస్ఏ అడ్వైజరీ బోర్డు చైర్మన్ తన్నీరు మహేష్ మాట్లాడుతూ— “అమెరికాలోని వివిధ రాష్ట్రాల బీఆర్‌ఎస్ మద్దతుదారులు, అనుబంధ సంఘాలు ఈ కార్యక్రమాన్ని సమన్వయపూర్వకంగా నిర్వహించనున్నాయి. ఇది అమెరికాలో బీఆర్‌ఎస్‌ చరిత్రలో మైలురాయిగా నిలిచే వేడుక అవుతుంది” అని తెలిపారు. ఎల్కతుర్తిలో జరిగిన బీఆర్‌ఎస్‌ రజతోత్సవ సభ తరహాలోనే, డల్లాస్‌లోని ఈ వేడుక కూడా చరిత్రలో నిలిచిపోయేలా చేయడం లక్ష్యంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ పర్యవేక్షణలో బీఆర్‌ఎస్‌ USA నాయకులు, శ్రీనివాస్ శురభి, వ్యాల్ల హరీష్ రెడ్డి, శ్రీనివాస్ సురకంటి మిగితా సభ్యులు పాల్గొన్నారు.

Also Read:భారీ వర్షాలు..బొగతకు జలకళ

- Advertisement -