బిగ్ బాస్ తెలుగు 6..అంతా రెడీ!

115
nag
- Advertisement -

బుల్లితెర రియాల్టీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 నేటి నుండి ప్రారంభంకానుంది. సాయంత్రం 6 గంటలకు నాగార్జున హోస్ట్‌గా మొదలుకానుండగా ఈసారి బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్లేవారు ఎవరు అనేదానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం… సారి హౌస్ లో సింగర్ రేవంత్, గలాటా గీతూ, బిగ్‌బాస్‌ రివ్యూ లతో ఫేమస్ అయిన ఆదిరెడ్డి, సిరి హనుమంత్ బాయ్‌ఫ్రెండ్‌ శ్రీహాన్‌, యాంకర్‌ నేహా చౌదరి, ఆర్జే సూర్య ఉండనున్నారట.

అలాగే జబర్దస్త్ కమెడియన్‌ చంటి, నటుడు బాలాదిత్య, నటుడు షాని, నటి సుదీప, యాంకర్‌ ఆరోహీ రావ్‌, సీరియల్‌ నటి శ్రీ సత్య, ఆర్జీవీ వీడియోలతో పాపులర్ అయిన ఇనయా సుల్తానా, జబర్దస్త్ లేడీ కమెడియన్‌ ఫైమా, కపుల్స్ రోహిత్‌, మరీనాలు ఉండబోతున్నట్టు తెలుస్తుంది.

- Advertisement -