ఏపీ కొత్త మంత్రుల జాబితా రెడీ ?

79
jagan
- Advertisement -

ఏపీ కొత్త కేబినెట్‌లో చోటు దక్కించుకునేవారెవరు అనేదానిపై అందరిలో ఉత్కంఠ నెలకొంది. కొత్త జట్టులో పాతవారిని 10 మందిని కొనసాగిస్తారని ప్రచారం జరుగుతుండగా పేర్లపై రకరకాల ప్రచారం జరుగుతోంది. బొత్స, పెద్దిరెడ్డి, కొడాలి, బుగ్గన, పేర్ని, అనిల్, బాలినేని, కన్నబాబు సీనియారిటీ ప్రకారం కొనసాగించే ఛాన్స్ ఉంది. ఎల్లుండి మంత్రుల ప్రమాణస్వీకారం జరిగే అవకాశం ఉంది.

ఇక సామాజిక సమీకరణాల ప్రకారం జయరామ్, వేణుగోపాల్, అప్పలరాజు, సురేష్, అంజాద్ బాషా, శంకర్ నారాయణ, తానేటి వనితను కొత్త కేబినెట్‌లోకి తీసుకుంటారని జోరుగా ప్రచారం నడుస్తోంది. ఇక జగన్‌ టీమ్‌లో 14 నుంచి 15 మంది వరకు మాత్రం కొత్త ముఖాలు కనిపించడం ఖాయంగా కనిపిస్తోంది.

ఎన్నికలకు మరో రెండున్నరేళ్ల సమయం ఉండటంతో తిరిగి పార్టీని అధికారంలోని తెవడమే లక్ష్యంగా జగన్ పావులు కదుపుతున్నారు. మంత్రి పదవి దక్కని వారికి పార్టీ బాధ్యలు అప్పజెప్పే అవకాశం ఉంది.

- Advertisement -