దేశంలో గుణాత్మక మార్పు తీసుకురావడానికి సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో ప్రవేశించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా వివిధ రాష్ట్రాల్లో పార్టీ విస్తరణపై దృష్టి సారించారు కేసీఆర్. ఇందులో భాగంగా తొలుత ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రలపై ఫోకస్ పెట్టారు. ఇప్పటికే ఆయా రాష్ట్రాలకు చెందిన ప్రముఖ నేతలు బీఆర్ఎస్‌లో చేరారు. ఇక ఆయా రాష్ట్రాల్లో పార్టీ కార్యాలయాల ఏర్పాటుకు చర్యలు చేపట్టారు.
ఏపీలోని గుంటూరు జిల్లాలో భారత రాష్ట్ర సమితి కార్యాలయం ప్రారంభించేందుకు ముహూర్తం ఖరారైంది. ఆటోనగర్ వద్ద ఏఎస్ కన్వెన్షన్ హాల్ వెనుక భాగంలో అయిదంతస్తులతో కూడిన నూతన భవనంలో కార్యాలయం కొలువుదీరనుంది. పార్టీ సమావేశాల నిర్వహణకు రెండు ఫ్లోర్లు కేటాయించారు. అతిథులు కూర్చొనే విధంగా పెద్దహాలు ఏర్పాటు చేశారు. ఇక, ఐదో అంతస్తులో రాష్ట్ర పార్టీ అధ్యక్షుడి కార్యాలయం ఉంటుంది.
Also Read:CM KCR:వీఆర్ఏలకు రెగ్యులర్ స్కేల్
ఈ నూతన కార్యాలయాన్ని 21(ఆదివారం) ఉదయం 11.35 నిమిషాలకు ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఏపీ రాష్ట్ర అధ్యక్షులు తోట చంద్రశేఖర్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు.
Also Read:HarishRao:ఆరోగ్య తెలంగాణ ..వీఆర్‌ఏల క్రమబద్దీకరణ ఇంకా..!