ఏపీలో ముందస్తు ఎన్నికలు జరిగే అవకాశం ఉందా ? ఎన్నికల కమిషన్ కూడా ముందస్తు ఎన్నికలకు సిద్దమైందా ? అంటే తాజా పరిణామాలు చూస్తే నిజమేనేమో అనే సందేహాలు వ్యక్తమౌతున్నాయి. గత కొన్ని రోజులుగా ఏపీలో ముందస్తు ఎన్నికల అంశం తరచూ వార్తల్లో నిలుస్తోంది, పవన్, చంద్రబాబు వంటి ఆగ్రనేతలు సైతం ముందస్తు ఎన్నికలు కన్ఫర్మ్ అంటూ చెబుతూనే ఉన్నారు. అయితే అధికార వైసీపీ మాత్రం ముందస్తు ఎన్నికలను ఎప్పటికప్పుడు ఖండిస్తూనే ఉంది. అసలు ముందస్తు ప్రస్తావనే లేదని, షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని స్పష్టం చేస్తూ వచ్చింది..
అయితే ఇప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం ఎలక్టోరల్ రిటర్నింగ్ అధికారులను నియమించడం దేనికి సంకేతం అని డౌట్ అందరిలోనూ వ్యక్తమౌతోంది. ఎవరు ఊహించని విధంగా ఈసీ తాజాగా ఏపీలోని అన్నీ నియోజిక వర్గాలకు రిటర్నింగ్ అధికారులను నియమిస్తూ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. సాధారణంగా ఎన్నికలు ఆరు నెలల సమయం ముందు ఇలాంటి ప్రక్రియ చేపట్టాల్సి ఉంటుంది కానీ.. ఏపీలో ఎన్నికలకు ఇంకా తొమ్మిది నెలలు సమయం ఉన్నప్పటికి ఇప్పుడు అధికారుల నియామక ప్రక్రియ చేపట్టడం ఎంటనే చర్చ జరుగుతోంది.
ఈ తాజా పరిణామాలను గమనిస్తే.. మోడి సర్కార్ ఏపీలో ముందస్తు ఎన్నికలకు రెడీ అయ్యే ప్లాన్ లో ఉందా ? సిఎం జగన్ పై ముందస్తు ఎన్నికల ఒత్తిడిని పెంచుతోందా అనే డౌట్ వ్యక్తమౌతోంది. ఈ ఏడాది చివర్లో తెలంగాణలో ఎన్నికలు జరగనున్నాయి. తెలంగాణతో పాటే ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తే మెలనే ఆలోచనలో మోడి సర్కార్ ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ముందస్తు ఎన్నికలకు సిఎం జగన్ ఎంతవరుకు సహకరిస్తారనేది ఆసక్తికరం. ఎందుకంటే ఇప్పటివరకు ముందస్తు ఎన్నికలకు నో చెబుతూ వస్తున్న జగన్.. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ చొరవతో ఒకే అనాల్సిన పరిస్థితి ఏర్పడింది. మొత్తానికి తాజా పరిణామాలు ఏపీలో ముందస్తు ఎన్నికలకు బాటలు వేస్తున్నాయనడంలో ఎలాంటి సందేహం లేదు.
Also Read:ఏపీ పాలిటిక్స్ అండోయ్.. అలాగే ఉంటాయ్!