ఇంగ్లాండ్‌తో మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా గౌహతి వేదికగా జరిగిన మొదటి టీ20లో భారత మహిళల జట్టు పరాజయంను చవిచూసింది. దీంతో మూడు టీ20ల సిరీస్‌లో ఇంగ్లాండ్ 1-0తో ఆధిక్యంలోకి వెళ్ళింది. 161 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు శుభారంభం దక్కలేదు.
తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ జట్టులో బీమాంట్(62), హీథర్‌నైట్(40), వ్యాట్(35) రాణించడంతో 20 ఓవర్లలో 4 వికెట్లకు 160 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో ఇంగ్లాండ్ బౌలర్లు ధాటిగా బౌలింగ్ చేయడంతో భారత అమ్మాయి చేతులెత్తేశారు. టాపార్డర్ దారుణ వైఫల్యంతో 46 పరుగులకే 5 వికెట్లు చేజార్చుకొని కష్టాల్లో పడింది.
టీమిండియా బ్యాటర్లు హర్లీన్(8), స్మృతి మంధాన(2), జెమిమా రోడ్రిగ్స్(2), మిథాలీ రాజ్(7) నిరాశపరిచారు. ఆఖరికి లోయర్ ఆర్డర్ బ్యాట్స్‌వుమన్ తలో చేయి వేస్తే గౌరప్రదమైన స్కోరు చేసింది. శిఖాపాండే(23 నాటౌట్), దీప్తి శర్మ(22 నాటౌట్) ఇంగ్లాండ్ బౌలర్లను ఎదుర్కొని కొంతసేపు పోరాటం చేశారు. దీంతో 20 ఓవర్లలో భారత్ 6 వికెట్లకు 119 పరుగులు మాత్రమే చేయగలిగింది. క్యాథరీన్ బ్రంట్(2/ 21), లిన్సే స్మిత్(2/22) భారత్‌ను కుప్పకూల్చి ఇంగ్లాండ్ విజయాన్ని అందించారు.