ముందంజలో జనగామ జిల్లా: మంత్రి ఎర్రబెల్లి

486
errabelli
- Advertisement -

టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక జనగామ జిల్లా అన్ని రంగాల్లో పురోగమిస్తుందని తెలిపారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. జనగామ జిల్లా కేంద్రంలోని నందనగార్డెన్స్‌లో గ్రామ పంచాయతీలకు ఎమ్మెల్సీ వెంకటేశ్వర్లు,ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి,రాజయ్య,జడ్పీ ఛైర్మన్ సంపత్ రెడ్డిలతో కలిసి ట్రాక్టర్ల పంపిణీ చేశారు ఎర్రబెల్లి.

టిఆర్ఎస్ ప్రభుత్వం రాకముందు జనగామ ప్రాంతం ఎలా ఉండేది. ఇప్పుడు ఎలా ఉంది. అప్పుడు వెనుకబాటుతనం ఉండేది. ఇప్పుడు అన్ని రకాలుగా ముందంజలో ఉంది అన్నారు. అన్ని గ్రామాలకు సాగు,తాగునీరు అందుతోంది…దీనిని సాకారం చేస్తున్న మహానుభావుడు సీఎం కేసీఆర్ అన్నారు.

ఎన్నో సవాళ్ళను పూర్తి చేసి రాష్ట్రాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేశారు…. సర్పంచులు పట్టుదలతో పని చేసి గ్రామాలను సమగ్రంగా అభివృద్ధి చేయాలని తెలిపారు. పారిశుధ్య నిర్వహణకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని సూచించిన ఎర్రబెల్లి…. ట్రాక్టర్ల పంపిణితో గ్రామాల్లో పారిశుధ్యం మెరుగుపడాలన్నారు.

తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించి గ్రామాలను పరిశుభ్రంగా పెట్టాలి…. ప్రతి ఊరికి డంపింగ్ యార్డు ఉండాలి. కేసీఆర్ ప్రభుత్వం డంపింగ్ నిర్మాణ నిధులను రెట్టింపు చేసిందన్నారు. హరితహారానికి ప్రతి గ్రామపంచాయతీ అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలి… ఆసరా పెన్షన్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.9800 కోట్లు ఇస్తుంటే… కేంద్ర ప్రభుత్వం రూ.200 కోట్లు మాత్రమే ఇస్తోందన్నారు.

30 రోజుల ప్రత్యేక ప్రణాళిక అమలులో ప్రజాప్రతినిధులు, సర్పంచులు, అధికారులు, గ్రామపంచాయతీ కార్యదర్శులు బాగా పని చేశారని తెలిపిన ఎర్రబెల్లి….. 30 రోజుల ప్రత్యేక ప్రణాళిక నిరంతర ప్రక్రియ. దీన్ని నిత్యం కొనసాగించాలన్నారు.

- Advertisement -