కేంద్ర రాజకీయాల్లో చక్రం తిప్పుతాం:ఎంపీ వినోద్

422
mp viond
- Advertisement -

16 ఎంపీ సీట్లు గెలిచి కేంద్ర రాజకీయాల్లో చక్రం తిప్పుతామని స్పష్టం చేశారు ఎంపీ వినోద్‌కుమార్ స్పష్టంచేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంత్రి ఈటలతో కలిసి కరీంనగర్,రామడుగు,కథలాపూర్‌ రోడ్‌ షోలో మాట్లాడిన వినోద్ రానున్న రోజుల్లో కరీంనగర్‌ను గొప్ప నగరంగా తీర్చిదిద్దుతామన్నారు.గోదావరి జలాలను గంగాధర మండలంలోని నారాయణపూర్ రిజర్వాయర్‌కు తీసుకువచ్చి ఇక్కడి భూములను సస్యశ్యామలం చేశామని చెప్పారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే కరెంటు కోతలు తప్పవనీ, కరెంటు తీగలపై బట్టలు ఆరేసుకుంటారని అప్పటి కాంగ్రెస్ పాలకులు ప్రచారం చేశారనీ, కానీ అనతికాలంలోనే కరెంట్ కష్టాలను అధిగమించామన్నారు. ఏపీలో పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చిన మోడీ సర్కార్‌ తెలంగాణపై చిన్నచూపు చూసిందని మండిపడ్డారు. విభజన చట్టంలో చిన్న సవరణ ద్వారా కాళేశ్వరం ప్రాజెక్టకు జాతీయ హోదా ఇవ్వవచ్చనీ, దీంతో తెలంగాణకు 50 వేల కోట్ల నిధులు వస్తాయని తెలిపారు.

కల్యాణలక్ష్మీ,షాదీముబారక్‌తో పేదింటి ఆడబిడ్డల పెళ్లిళ్లకు లక్ష రూపాయల సాయం అందిస్తున్నామని రెసిడెన్షియల్ పాఠశాలలు పెట్టి నాణ్యమైన విద్యను అందిస్తున్నామని తెలిపారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా రైతుబంధు, రైతు బీమా పథకాలతో రైతుల జీవితాల్లో భరోసా నింపామన్నారు.

ఎన్నికల తర్వాత కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడుతుందనీ, ప్రాంతీయ పార్టీలు లేకుండా ప్రభుత్వం ఏర్పడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. కరీంనగర్ స్మార్ట్ సిటీ సాధించామనీ, రానున్న రోజుల్లో రూ.వెయ్యి కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతాయని తెలిపారు.

- Advertisement -