పోచంపల్లికి అభినందనల వెల్లువ..

319
pochampally
- Advertisement -

స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికల్లో వరంగల్ ఎమ్మెల్సీగా తెలంగాణ ఉద్యమ నేత పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి భారీ మెజార్టీతో గెలుపొందారు. దాదాపు 825 ఓట్ల భారీ ఆధిక్యంతో కాంగ్రెస్ అభ్యర్థిపై ఘనవిజయం సాధించారు. పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డికి 848 ఓట్లు పోలవగా.. కాంగ్రెస్ అభ్యర్థికి 23 ఓట్లు పోలయ్యాయి. తన గెలుపుకు సహకరించిన పార్టీ నేతలకు కృతజ్ఞతలు తెలిపారు. జిల్లాలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలిపారు.

స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ లు గా ఎంపికైన మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి, టి.చిన్నపరెడ్డి, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డిలకు మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అభినందనలు తెలిపారు. ఈ ముగ్గురు ఎమ్మెల్సీల విజయంతో మండలిలో టీఆర్ఎస్ బలం మరింత పెరిగిందన్నారు. ప్రాదేశిక ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ పార్టీయే ఘన విజయం సాధిస్తుంది అని చెప్పారు.

నల్గొండ జిల్లా ….హాలియాలో ఎమ్మెల్సీ గా తేరా చిన్నపరెడ్డి గెలుపొందిన సందర్భంగా టపాకాయలు కాల్చి, స్వీట్లు పంచారు టీఆర్ఎస్ కార్యకర్తలు.

- Advertisement -