ఆర్ఆర్ఆర్ టీమ్ పై ప్రశంసల వర్షం!

77
- Advertisement -

ప్రతిష్ఠాత్మక గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్‌లో ‘ఆర్ఆర్ఆర్’ సినిమా రికార్డు సృష్టించింది. బెస్ట్ సాంగ్ కేటగిరీలో ‘నాటు నాటు’ సాంగ్‌కు అవార్డు దక్కిన సంగతి తెలిసిందే. దాంతో పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు ఆర్ఆర్ఆర్ టీమ్ కు తమ విషెస్ చెబుతున్నారు. ‘ఆర్ఆర్ఆర్’ నాటు నాటు పాటకు ఒరిజన్ సాంగ్ కేటగిరీలో గోల్డెన్ గ్లోబ్ అవార్డు రావడంపై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. “బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో కీరవాణికి గోల్డెన్ గ్లోబ్ అవార్డు రావడం చారిత్రాత్మక, అపూర్వమైన విజయం. ఆర్ఆర్ఆర్ చిత్రబృందానికి, రాజమౌళికి శుభాకాంక్షలు. మీ వల్ల దేశం గర్విస్తోంది” అంటూ చిరు ట్విట్టర్ వేదికగా తెలిపారు. అలాగే ఏఆర్ రెహమాన్ స్పందిస్తూ… ‘ఇదో అద్భతం.. నమ్మశక్యం కానిది.. ఇండియా తరపున.. ఇండియన్ ఫ్యాన్స్ తరుపున కీరవాణి గారికి శుభాకాంక్షలు. ఆర్ఆర్ఆర్ టీంకు కంగ్రాట్స్’ అని ట్వీట్ చేశారు.

అన్నిటికీ కంటే ముఖ్యంగా ప్రధాని మోదీ అభినందన ఆర్ఆర్ఆర్ అభానులను అమితంగా ఆకట్టుకుంటుంది. ‘నాటు నాటు’ పాటకు గోల్డెన్ గ్లోబ్ అవార్డు దక్కడంపై ప్ర‌ధాని మోదీ స్పందించారు. ఈ ప్రతిష్టాత్మకమైన గౌరవం ప్రతి భారతీయుడిని ఎంతో గర్వించేలా చేసిందన్నారు. కీరవాణి, ప్రేమ్ రక్షిత్, కాల భైరవ, చంద్రబోస్, దర్శకుడు రాజమౌళి, ఎన్టీఆర్, రాంచరణ్, రాహుల్ సిప్లిగంజ్‌లను కూడా అభినందిస్తున్నానంటూ ప్రధాని మోదీ ట్వీట్‌ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ గా మారింది. మరోవైపు ఈ పాట రాసిన చంద్రబోస్‌ ఎమోషనల్ అవుతూ ఒక మెసేజ్ పోస్ట్ చేశారు.

‘నాటు నాటు’ పాటకు గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డు పై చంద్రబోస్‌ స్పందిస్తూ.. నా జీవితంలో మరచిపోలేని మధుర క్షణాలివి. 3,500లకు పైగా పాటలు రాసిన నాకు ప్రతి పాట ఓ తపస్సు లాంటిదే. ఈసారి ‘నాటు నాటు’ పాటకు చేసిన తపస్సుకు ఆ భగవంతుడే ప్రత్యక్షమై ఇచ్చిన వరం ఈ పురస్కారం అని చెప్పుకొచ్చారు. మొత్తమ్మీద ఇప్పుడు దేశ‌వ్యాప్తంగా ఎక్కడ చూసినా సినీ ప్రియుల చ‌ర్చల‌న్నీ ఆర్ఆర్ఆర్ చుట్టూనే తిరుగుతున్నాయి.

ఇవి కూడా చదవండి..

- Advertisement -