కూపర్ కానోలీపై ప్రశంసల జల్లు!

6
- Advertisement -

ఐపీఎల్ 2026లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన ఉత్కంఠభరిత పోరులో పంజాబ్ కింగ్స్ ఓటమి పాలైనప్పటికీ, ఆ జట్టు యువ బ్యాటర్ కూపర్ కానోలీ చరిత్ర సృష్టించాడు. కేవలం 22 ఏళ్ల వయసులోనే ఐపీఎల్‌లో సెంచరీ బాదిన అతి పిన్న వయస్కుడైన ఓవర్సీస్ ప్లేయర్‌గా అతను రికార్డు నెలకొల్పాడు.

ఈ అద్భుత ఇన్నింగ్స్ తర్వాత పంజాబ్ స్పిన్ బౌలింగ్ కోచ్ సాయిరాజ్ బహుతులే మాట్లాడుతూ..కానోలీ ఆటతీరును కొనియాడారు. అతని భుజాల మీద సరైన ఆలోచనలు కలిగిన బుర్ర ఉంది . పరిస్థితికి తగ్గట్టుగా ఎలా ఆడాలో అతనికి తెలుసు అని బహుతులే అన్నారు.

కానోలీ కేవలం తన వ్యక్తిగత స్కోరు కోసం కాకుండా, జట్టు విజయం కోసం ఆడే ‘టీమ్ మ్యాన్’ అని, అటువంటి ఆటగాళ్లు జట్టుకు చాలా అవసరమని ఆయన పేర్కొన్నారు. 236 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో వికెట్లు పడుతున్నా, అతను వెనక్కి తగ్గకుండా 59 బంతుల్లో 107 పరుగులు చేయడం అతని ఆత్మవిశ్వాసానికి నిదర్శనమని కోచ్ తెలిపారు.

కానోలీ 22 ఏళ్ల 257 రోజుల వయసులో ఈ సెంచరీ సాధించి, క్వింటన్ డి కాక్ రికార్డును అధిగమించాడు. తన ఇన్నింగ్స్‌లో 7 ఫోర్లు మరియు 8 భారీ సిక్సర్లు బాదాడు.కానోలీ వీరోచిత పోరాటం చేసినప్పటికీ, పంజాబ్ కింగ్స్ 33 పరుగుల తేడాతో ఓటమిని చవిచూసింది.పంజాబ్ కింగ్స్ ప్రస్తుతం పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి పడిపోయింది.

Also Read:Modi:యావత్ దేశం సెల్యూట్ చేస్తోంది

- Advertisement -