పార్టీలు రెడీ.. నోటిఫికేషన్ ఎప్పుడు ?

53
- Advertisement -

తేలంగాణలో ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. నవంబర్ లేదా డిసెంబర్ లో ఎలక్షన్స్ జరగనున్నాయి. అయితే అంతకంటే ముందే ఎన్నికలు జరగవచ్చనే ఊహగానాలు పోలిటికల్ సర్కిల్స్ లో గత కొన్ని రోజులుగా చక్కర్లు కొడుతున్నాయి. ఎట్టి పరిస్థితుల్లో ముందస్తు ఎన్నికలకు వెళ్లబోమని బి‌ఆర్‌ఎస్ ప్రభుత్వం చెబుతున్నప్పటికి.. ముందస్తు ఎన్నికలపై వస్తున్న వార్తలు మాత్రం ఆగడం లేదు. ఎందుకంటే ప్రస్తుతం మూడు మూడు ప్రధాన పార్టీలు కూడా ఎన్నికల మూడ్ లోకి వచ్చేశాయి. నువ్వా నేనా అన్నట్లుగా పార్టీల ఆగ్రనేతలు బహిరంగ సభలు పర్యటనలు, సమావేశాలు.. నిర్వహిస్తు ఎన్నికల మూడ్ ను తలపిస్తున్నారు. ఇదిలా ఉంచితే సెప్టెంబర్ లో ఎన్నికల కోడ్ వెలువడే అవకాశం ఉందని పోలిటికల్ సర్కిల్స్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

అందుకే ప్రధాన పార్టీలన్నీ దూకుడు పెంచినట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ లో కాంగ్రెస్ మేనిఫెస్టో ప్రకటించబోతున్నట్లు ఆ పార్టీ గతంలోనే ప్రకటించింది. ఇక బీజేపీ కూడా మేనిఫెస్టో పై కసరత్తులు చేస్తోంది. మరోవైపు ఈ రెండు పార్టీల కంటే అధికార బి‌ఆర్‌ఎస్ ఒక అడుగు ముందే ఉన్నట్లు తెలుస్తోంది. మేనిఫెస్టో ను సరైన సమయంలో ప్రకటించడంతో పాటు ఇప్పటికే అమలౌతున్న పథకాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని చూస్తోంది. దీంతో మూడు నెలల ముందు నుంచే రాష్ట్రంలో ఎన్నికల హడావిడి మొదలైంది. ఈసారి గెలుపు కోసం మూడు పార్టీలు గట్టిగా పోటీ పడుతుడడంతో గెలుపును అంచనా వేయడం విశ్లేషకులకు సైతం కష్టంగా మారింది. అయితే ఈసారి కూడా బి‌ఆర్‌ఎస్ కే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఇప్పటివరకు వెలువడిన సర్వేలు స్పష్టం చేశాయి. మరి తెలంగాణ ప్రజల తీర్పు ఎలా ఉండబోతుందో చూడాలి.

Also Read:‘ఓ మై గాడ్ 2’కు సెన్సార్ షాక్!

- Advertisement -