ముగిసిన అఖిలపక్ష సమావేశం..

281
all party meeting
- Advertisement -

నేడు ఢిల్లీలోని పార్లమెంట్ లైబ్రరీ హాల్‌లో అఖిలపక్ష సమావేశం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ సమావేశం కొద్దిసేపటి క్రితమే ముగిసింది. అఖిలపక్ష సమావేశానికి ప్రధాని నరేంద్ర మోడీతో పాటు వివిధ పార్టీల పార్లమెంటరీ పక్ష నేతలు హాజరైయ్యారు. టిఆర్ ఎస్ తరుపున పార్లమెంటరీ పక్ష నేత ఎంపీ కేకే, ఎంపీ నామా నాగేశ్వరరావు పాల్గొన్నారు.

పార్లమెంటరీ పక్ష నేత కేకే మాట్లాడుతూ.. సీఏఏ, ఎన్ పీఆర్, ఎన్ ఆర్సీ పై ఏ ముఖ్యమంత్రి చెప్పనట్టుగా ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టంగా చెప్పారు. అసెంబ్లీ తీర్మాణం చేస్తం అని చెప్పారు..రాష్ట్రలకు అభిప్రాయం ఇచ్చే అవకాశం ఉంటుంది. పార్లమెంట్ పాస్ చేసిన బిల్లు పై ప్రజలు రోడ్లపైకి వస్తున్నారు.. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వ్యతిరేకిస్తున్నాయన్నారు. ఎందుకు ఇలా జరుగుతుందో కేంద్రం ఆలోచించాలి. సీఏఏ ఆందోళనలపై సభలో చర్చ జరగాలి. ఈ బిల్లును గతంలోనే వ్యతిరేకిస్తున్నామని చెప్పాము. అలాగే ఎన్‌పీఆర్‌ మీద గందరగోళం నెలకొంది.

modi

సీఏఏ కు మొదటి స్టెప్ ఎన్ పిఆర్ అని కేంద్ర హోంశాఖ వార్షిక రిపోర్ట్ లో ఉంది.దీనిపై అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఒక సమావేశం నిర్వహించలని సూచించాము. కేంద్రం రాష్ట్రాల హక్కులను ఒక్కోటి తీసుకుంటున్నారు. ఫెడరల్ స్ఫూర్తి కి ఇది విరుద్ధం. విభజన హామీలు అన్ని పెండింగ్ లో ఉన్నాయి. ఒక రోజు మొత్తం విభజన హామీలపై చర్చించాలని కోరినం అని కేకే అన్నారు.

లోక్ సభ పక్ష నేత నామా నాగేశ్వరరావు మాట్లాడుతూ.. సీఏఏ బిల్లు పార్లమెంటులో ప్రవేశపెట్టగానే సీఎం కేసీఆర్ మాతో చర్చించారు. ఈ బిల్లును వ్యతిరేకించాలని చెప్పారు. అదే విధంగా ఉభయసభల్లో బిల్లును వ్యతిరేకించాము. ఈ బిల్లు పాస్ అయితే దేశవ్యాప్తంగా ఆందోళనలు వస్తాయని ఆనాడే ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు. 6 యేండ్లు అయిన విభజన హామీలు పెండింగ్ లో ఉన్నాయి..దీన్ని దేశంలో ఉన్న ప్రజలు, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యతిరేకిస్తున్నాయని నామా తెలిపారు.

- Advertisement -