పార్లమెంట్ సమావేశాలు..అఖిలపక్ష సమావేశం

3
- Advertisement -

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో కీలక జాతీయ అంశాలు, శాసన వ్యవహారాలపై చర్చించేందుకు కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించింది. కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు అధ్యక్షతన ప్రధాన కమిటీ హాలులో జరిగింది.

జనవరి 28 నుంచి ప్రారంభమయ్యే బడ్జెట్ సమావేశాల్లో లేవనెత్తే ప్రధాన జాతీయ అంశాలు, శాసన పనులను సజావుగా నిర్వహించడమే లక్ష్యంగా ఉంది. బడ్జెట్ సమావేశాలు ఏప్రిల్ 2 వరకు కొనసాగనున్నాయి.

బడ్జెట్ సమావేశాల తొలి దశ జనవరి 28 నుంచి ఫిబ్రవరి 13 వరకు జరగనుండగా, రెండో దశ మార్చి 9 నుంచి ఏప్రిల్ 2 వరకు కొనసాగుతుంది. మొత్తం 30 సమావేశాలు (సిట్టింగ్స్) నిర్వహించనున్నారు. ఈ సమావేశాల్లో భాగంగా కేంద్ర బడ్జెట్ 2026–27ను ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టనున్నారు.

ఈ బడ్జెట్ సమావేశాలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అధికారికంగా ప్రారంభించనున్నారు. ఆమె లోక్‌సభ, రాజ్యసభ సభ్యులను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.

Also Read:గ్రీన్ ఛాలెంజ్‌లో అశ్విని రాజ్‌కుమార్‌

- Advertisement -