ఢిల్లీలో అఖిల పక్ష సమావేశం..

5
- Advertisement -

పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల నేపథ్యంలో ఇవాళ ఢిల్లీలో అఖిలపక్ష సమావేశం జరుగుతోంది. కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ అధ్యక్షతన ఉదయం 11 గంటలకు ఈ భేటీ నిర్వహించనున్నారు. డిసెంబర్‌ 1 నుంచి 19 వరకు జరగనున్న పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు సజావుగా సాగేందుకు అన్ని పార్టీలు సహకరించాలని కేంద్రం ఈ సమావేశంలో విజ్ఞప్తి చేయనుంది.

ఈ సమావేశాల్లో దాదాపు 10 కీలక బిల్లులు ప్రవేశపెట్టే అవకాశముంది. వీటిలో అణు ఇంధన బిల్లు, కార్పొరేట్ చట్ట సవరణ బిల్లు, సెక్యూరిటీ మార్కెట్ కోడ్ బిల్లు, జాతీయ రహదారుల సవరణ బిల్లు వంటి ప్రధాన చట్టపరమైన ప్రతిపాదనలు ఉన్నాయి. దేశ ఆర్థిక, పారిశ్రామిక రంగాలపై ప్రభావం చూపే బిల్లులు ఉండటంతో ప్రభుత్వం ఈ సమావేశాలను ఎంతో ప్రాముఖ్యంగా తీసుకుంటోంది.

ఇదిలా ఉండగా, విపక్షాలు కూడా శీతాకాల సమావేశాలకు సిద్ధమవుతున్నాయి. ముఖ్యంగా SIR (ఓటర్ల సవరణ జాబితా) అంశం, అదానీ గ్రూప్‌పై ఆరోపణలు, ఢిల్లీ వాయు కాలుష్యం, నిరుద్యోగం, ధరల పెరుగుదల వంటి కీలక సమస్యలను పార్లమెంట్‌లో బలంగా లేవనెత్తేందుకు విపక్షాలు వ్యూహాలు రచిస్తున్నాయి. ఈ నేపథ్యంలో జరుగుతున్న అఖిలపక్ష సమావేశం శీతాకాల సమావేశాల దిశను నిర్ణయించే కీలక వేదికగా మారింది.

Also Read:Peddi: కీలక షెడ్యూల్‌లో ‘పెద్ది’

- Advertisement -