ఆ సమయంలో నేను గర్భవతిని…..

261
- Advertisement -

యాంకర్ అనసూయ..తెలుగు ప్రేక్షకులకు పరిచయం చెయ్యనక్కర్లేనిపేరు. బుల్లితెర ప్రపంచంలో బాగా పాపులర్ అయిన ఈ యాంకర్ సినిమాల్లో కూడా తన సత్తా ఏమిటో చూపిస్తోంది. న్యూస్ రీడర్‌గా పరిచయమైన అనసూయ ‘జబర్దస్త్’ కామెడీ షో ద్వారా బాగా పాపులారిటీ సంపాదించుకుంది. ఆ తర్వాత పలువురు స్టార్ హీరోల సినిమా ఆడియో ఫంక్షన్లలో యాంకరింగ్ చేయడంతో పెద్ద సెలబ్రిటీ అయిపోయింది అనసూయ. పొట్టి పొట్టి డ్రెస్‌లు వేసుకుని బుల్లితెరపై నానా యాగి చేస్తుంది.
All of that because of Pawan Kalyan Anasuya
అయితే ఇటీవలే ఈ అమ్మడు ఐటెంసాంగ్‌లకు వరసగా గ్రీన్‌ సిగ్నల్స్‌ ఇస్తున్న సంగతి తెలిసిందే. అత్తారింటికీ దారేది సినిమాలో పవన్‌ కలిసి పబ్‌సాంగ్‌లో డాన్స్‌ చేసే ఆఫర్‌ వచ్చిన ఈ అమ్మడు కాదని సంగతి కూడా విధితమే. ప్రస్తుతం టాలీవుడ్‌లో ఉన్న ఆర్టిస్టులు ఏవరైన సరే పవన్‌తో సినిమా అంటే ఎగిరి గంతేస్తారు పవర్‌స్టార్‌తో నటించాలని దేవుడ్ని కూడా ప్రార్థించే సెలబ్రేటీ ఫ్యాన్స్‌ కూడా ఉన్నారు. కానీ ఇటీవలే కాటమరాయుడు సినిమాలో పవన్‌తో ఐటెం సాంగ్స్‌ లో నటించడం తనకు ఇష్టం లేదంటూ షాకిచ్చేసింది అనసూయ. పవన్‌కు నో చెప్పి సాయిధరమ్‌ తేజ్‌ విన్నర్‌సినిమాలో ఐటెంసాంగ్‌ చేసింది ఈభామ. పవన్‌తో ఐటెంసాంగ్స్‌ చేయనన్న చెప్పిన అనసూయ ఇప్పుడు మెగా హీరో సాయిధరమ్‌తేజ్‌తో ఎందుకు చేసింది అనే ప్రశ్నలు ఆమెను వెంటాడుతున్నాయి.
All of that because of Pawan Kalyan Anasuya
తాజాగా పవన్‌కళ్యాణ్‌తో ఐటెంసాంగ్‌ చేయలేకపోవడానికి గల కారణాన్ని అనసూయ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. ‘‘పవన్ కల్యాణ్ సినిమాలో ఆఫర్ అంటే ఎవరైనా కాదంటారా? కానీ నేనెందుకు కాదన్నానంటే.. ఆ సమయంలో నేను గర్భవతిని. అందుకే ఐటెం సాంగ్ ఆఫర్ వచ్చినా కాదన్నాను’’ అని రీసెంట్ ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించింది హాట్ యాంకర్ అనసూయ.

అనసూయ చెప్పిన కారణం నిజమైనప్పటికి….దీనిపై పవర్‌స్టార్‌ అభిమానులు మండిపడుతున్నారు. ఇదే కారణం అప్పుడే చెబితే ఈ మేటర్‌ ఇంతవరకు వచ్చింది కాదు కదా అంటూ సోషల్‌మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. విన్నర్‌మూవీలో  ఐటెం సాంగ్‌ చేసిన హట్‌యాంకర్‌ అనసూయ ఏరేంజ్‌లో ఆడిపాడిందో తెలియాలంటే ఈనెల24 వరకు వేచిచూడాల్సిందే.

- Advertisement -