ప్రతి సామాన్య పౌరుడి సమస్యను తీర్చేందుకు ఇంటర్నెట్‌నే సాధనంగా మార్చాలనే ఉద్దేశంతో ప్రభుత్వం టీహబ్‌ను ముందుకు తీసుకొచ్చింది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ఈ టీ హబ్ దేశంలో స్టార్టప్ క్యాపిటల్‌గా హైదరాబాద్ అవతరించింది.
2016లోనే రాష్ట్ర ప్రభుత్వం ఇన్నోవేషన్ పాలసీని రూపొందించి అమల్లోకి తీసుకొచ్చింది. కేవలం ఐటీ రంగంలోనే కాకుండా ఔషధ, బయో, మెడికల్, వ్యవసాయ, మహిళ, సామాజిక అంశాల్లో ప్రత్యేకంగా స్టార్టప్‌లను ఏర్పాటు చేసేందుకు వీలుగా వేర్వేరు ప్రాంతాల్లో ఇంక్యుబేటర్‌లను ఏర్పాటు చేయించారు. ఇప్పుడు ఈ టీ హబ్‌కు అంతర్జాతీయ గుర్తింపు లభించింది.
టీ హబ్ ద్వారా 2 వేలకుపైగా స్టార్టప్‌లకు ప్రయోజనం చేకూరగా 75కుపైగా ప్రముఖ కంపెనీల నుంచి స్టార్టప్‌లకు భాగస్వామ్యం లభింయింది. 600లకుపైగా కార్పొరేట్ కంపెనీలతో కలిసి స్టార్టప్ ప్రోత్సాహక కార్యక్రమాలు చేపట్టారు. 700లదాకా అంతర్జాతీయ భాగస్వామ్య కార్యక్రమాలు…42 దేశాలు టీ-హబ్‌ను చూసి కొత్తగా ఆవిష్కరణల కోసం కార్యక్రమాలు చేపట్టాయి. టీ-హబ్‌ను ఇప్పటిదాకా 1.50 లక్షల మంది సందర్శించారు.
Also Read:World Cup 2023:ఆసీస్ ఊపిరి పిల్చుకున్నట్లే!