కిరణ్ అబ్బవరం, నేహా శెట్టి జంటగా నటించిన మచ్ అవైటెడ్ మూవీ ‘రూల్స్ రంజన్’. సుప్రసిద్ధ నిర్మాత ఎ.ఎం.రత్నం తనయుడు రత్నం కృష్ణ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. స్టార్ లైట్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై మురళీ కృష్ణ వేమూరి, దివ్యాంగ్ లావానియా నిర్మించారు. పూర్తి వినోదాత్మకంగా రూపొందిన ఈ సినిమా అక్టోబర్ 6న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలో గురువారం విలేఖర్లతో ముచ్చటించిన దర్శకుడు రత్నం కృష్ణ చిత్రానికి సంబంధించిన పలు విశేషాలను పంచుకున్నారు.
దర్శకుడిగా మీరు ఇంతింత గ్యాప్ తో తక్కువ సినిమాలు చేయడానికి కారణమేంటి?
నేను తీసిన సినిమాలకు దర్శకుడిగా మంచి పేరే వచ్చింది. కానీ వాళ్ళ నాన్నకే సొంతంగా పెద్ద ప్రొడక్షన్ హౌస్ ఉంది. ఇతను బయట వాళ్ళకి సినిమాలు చేస్తాడా అని మిగతా వాళ్ళు అనుకోవడం వల్ల నాకు పెద్దగా అవకాశాలు రాలేదు. కొందరు హీరోలకు కథలు వినిపించినా కూడా మీ ఓన్ ప్రొడక్షన్ హౌస్ లో అయితే చేద్దాం అనేవాళ్ళు. అలాగే మధ్యలో నాన్నగారు నిర్మించిన పలు సినిమాల ప్రొడక్షన్ బాధ్యతలు చూసుకున్నాను. ఇలా పలు కారణాల వల్ల దర్శకుడిగా ఎక్కువ సినిమాలు చేయలేకపోయాను.
ఆక్సిజన్ సినిమా మిస్ ఫైర్ అవడానికి కారణం?
ఆక్సిజన్ మంచి సినిమా. ఆలస్యంగా, అప్పటికప్పుడు విడుదల చేయడం వల్ల తెలుగు ప్రేక్షకులకు కావల్సినంత చేరువ కాలేదు. అయితే తెలుగు సినిమా అయినప్పటికీ విడుదల రోజు చెన్నై నుంచి దాదాపు 50 ఫోన్లు వచ్చాయి సినిమా బాగుందని. ఆ తర్వాత తమిళ్ లో డబ్ చేసి విడుదల చేస్తే మంచి రెస్పాన్స్ వచ్చింది. వాళ్ళకి గోపీచంద్ గురించి, ఆయన ఇమేజ్ గురించి తెలీదు. కథని కథలాగా చూశారు.. వాళ్ళకి నచ్చింది. తెలుగులో కూడా తర్వాత టీవీలలో చూసి ఆక్సిజన్ సినిమా బాగుంది అంటూ ఎందరో ఫోన్లు చేసి చెప్పారు.
రూల్స్ రంజన్ కి కామెడీ జానర్ ని ఎంచుకోవడానికి కారణం?
ఆక్సిజన్ సినిమానే కారణం. ఆ సినిమా ప్రివ్యూ వేసినప్పుడు మీడియా పర్సన్స్ అందులో ఉన్న కామెడీ సన్నివేశాలకు నవ్వుతున్నారు కానీ సీరియస్ సన్నివేశాలను పట్టించుకోవడం లేదు. ఎంటర్టైన్మెంటే సెల్లింగ్ పాయింట్ అని అప్పుడే అర్థమైంది. ప్రేక్షకులు కూడా వినోదమే కోరుకుంటున్నారు. అందుకే ఇప్పుడు రూల్స్ రంజన్ తో అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ చేశాను. ఫస్టాప్ యూత్ ఫుల్ గా, సెకండాఫ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఉంటుంది. సినిమా ఆద్యంతం వినోదభరితంగా హాయిగా నవ్వుకునేలా ఉంటుంది.
కిరణ్ ఈ ప్రాజెక్ట్ లోకి ఎలా వచ్చారు?
జాతి రత్నాలు చూసి నేను నవీన్ పోలిశెట్టి కి బిగ్ ఫ్యాన్ అయ్యాను. అసలు ఈ కథ ఆయనకి చెప్పాలని ప్రయత్నించాను కానీ కుదరలేదు. అదే సమయంలో నా ఫ్రెండ్స్ కొందరు ఎస్.ఆర్. కళ్యాణ మండపం సినిమా చూసి కిరణ్ పేరు సూచించారు. అయితే కిరణ్ అప్పటికే పలు కమిట్ అయ్యి ఉండటంతో నన్ను కలిసి ఈ సినిమా చేయలేనని చెప్దాం అనుకున్నారట. కానీ కథ విన్నాక ఆయనకు బాగా నచ్చడంతో సినిమా చేస్తానన్నారు. నేను కూడా ఆయన కోసం వెయిట్ చేసి సినిమా పూర్తి చేశాను. కిరణ్ మంచి క్రియేటర్. మా ఇద్దరికీ బాగా సింక్ అయింది.
Also Read:Jr NTR:దేవరలో ఎన్టీఆర్ విలన్ పాత్ర?
మీ నాన్నగారు సినిమా చూశారా?
రఫ్ కట్ చూశారు. అంతకంటే ముందే కిరణ్ ఫ్రెండ్స్, నా ఫ్రెండ్స్ అందరం కలిసి రష్ వెర్షన్ చూశాము. రష్ వెర్షన్ అయినప్పటికీ ఫ్రెండ్స్ అంతా సినిమా చూస్తూ నవ్వుతూనే ఉన్నారు. అందరికీ సినిమా బాగా నచ్చింది. నాన్నగారు, తమ్ముడు(రవికృష్ణ) కూడా సినిమా చూసి చాలా హ్యాపీ ఫీలయ్యారు. సినిమా పట్ల అందరం సంతోషంగా ఉన్నాం.
7G బృందావన కాలనీ మూవీ రీ రిలీజ్ రెస్పాన్స్ చూసి ఏమనిపించింది?
ఈ స్థాయి రెస్పాన్స్ అస్సలు ఊహించలేదు అంది. రీ రిలీజ్ రెస్పాన్స్ చూశాక ఇప్పుడు నాన్నగారు తన పూర్తి ఫోకస్ 7G బృందావన కాలనీ సీక్వెల్ పైనే పెట్టారు. వచ్చే నెల నుంచి షూటింగ్ ప్రారంభమవుతుంది.
Also Read:అతిమూత్ర సమస్యను తగ్గించే చిట్కాలు!