Congress:టీపీసీసీ దక్కెదవరికో?

21
- Advertisement -

తెలంగాణ కాంగ్రెస్‌కు త్వరలో కొత్త అధ్యక్షుడు రానున్న సంగతి తెలిసిందే.గత ఎన్నికల్లో పీసీసీ చీఫ్‌గా కాంగ్రెస్‌ను అధికారంలోకి తేవడంలో సక్సెస్ సాధించారు రేవంత్ రెడ్డి. ఆ తర్వాత సీఎంగా, పీసీసీ అధ్యక్షుడిగా కొనసాగారు. అయితే పార్టీ,పదవి రెండింటిని ఒక్కరికే అప్పగించడం సరికాదని భావించిన కాంగ్రెస్..అధ్యక్షుడిగా ఎవరిని, ఏ సామాజిక వర్గం వారిని ఎంపిక చేయాలని తీవ్ర కసరత్తు చేస్తోంది.

పీసీసీ రేసులో సామాజికవర్గాల సమీకరణలను పరిగణలోకి తీసుకుంటే బీసీ కోటాలో మంత్రి పొన్నం ప్రభాకర్, మధుయాష్కి గౌడ్,సురేష్ షెట్కార్ పేర్లు పరిశీలనలో ఉండగా సీతక్క,బలరాం నాయక్ పేర్లు ప్రచారంలో ఉన్నాయి. అయితే ప్రధానంగా అధ్యక్ష పదవి రేసులో జగ్గారెడ్డి పేరు వినిపిస్తోంది. రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితుల్లో జగ్గారెడ్డి ఒకరు. అంతేగాదు మాస్ ఇమేజ్ ఉండటంతో జగ్గారెడ్డికే పీసీసీ చీఫ్ పదవి దక్కొచ్చని ప్రచారం జరుగుతోంది.

ఇక టీపీసీ చీఫ్ ఎన్నిక తర్వాత మంత్రివర్గ విస్తరణ ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గ్రేటర్‌ హైదరాబాద్‌ నుంచి ఒకరికి మంత్రివర్గంలో ప్రాతినిథ్యం దక్కనుండగా ప్రధానంగా దానం నాగేందర్ పేరు వినిపిస్తోంది. మొత్తంగా పీసీసీ చీఫ్, మంత్రివర్గ విస్తరణలో ఎవరికి అవకాశం దక్కుతుందోనని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Also Read:ఈనాడు రామోజీరావు ఇకలేరు..

- Advertisement -