TG Cabinet:ఆ నలుగురు ఎవరు?

19
- Advertisement -

రాష్ట్ర కేబినెట్ విస్తరణపై వార్తలు జోరందుకున్నాయి. రేవంత్ ఢిల్లీ పర్యటన ముగించుకుని వచ్చిన తర్వాత కేబినెట్ విస్తరణ ఉండే అవకాశం ఉంది. ఈ సారి మంత్రివర్గ విస్తరణలో ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, రంగారెడ్డి, హైదరాబాద్‌ జిల్లాలకు ప్రాధాన్యం దక్కే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి గవర్నర్ తో భేటీ కాగా మంత్రి వర్గ విస్తరణకు అందుబాటులో ఉండాలని కోరినట్లు తెలుస్తోంది.

తెలంగాణ కేబినెట్ లో ప్రస్తుతం సీఎంతోపాటు 11 మంది మంత్రులుగా ఉన్నారు. మరో ఆరుగురిని కొత్తగా మంత్రి వర్గంలోకి తీసుకొనే అవకాశం ఉండగా ఈసారి విస్తరణలో నలుగురికి మాత్రమే ఛాన్స్ ఉండనున్నట్ల తెలుస్తోంది. సామాజిక సమీకరణాల ఆధారంగా రెడ్డి సామాజిక వర్గానికి రెండు, వెలమ సామాజిక వర్గానికి ఒకటి, బీసీలకు ఒక మంత్రి పదవి దక్కే అవకాశం ఉంది.

నలుగురికి మంత్రి పదవులతో పాటు ఒకరికి డిప్యూటీ స్పీకర్, ప్రభుత్వ చీఫ్ విప్ పదవి దక్కే ఛాన్స్ ఉన్నట్లు టాక్ నడుస్తోంది. నిజామాబాద్ జిల్లా నుంచి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా నుంచి ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి, మక్తల్ ఎమ్మెల్యే శ్రీహరి ముదిరాజ్ పేర్లు దాదాపు ఖరారు కాగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి సైతం మంత్రివర్గంలో స్థానం దక్కే అవకాశం ఉంది. డిప్యూటీ స్పీకర్‌, చీఫ్‌ విప్‌ పదవులకు పరిశీలనలో దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డిల పేర్లు వినిపిస్తున్నాయి.

Also Read:డ్రగ్స్‌పై పోరులో ముందుకురండి:కేతిరెడ్డి

- Advertisement -