5, 10, 20, 50, 100 రూపాయల నోట్లనూ తొలగిస్తాం..

277
all denomination of notes to be reintroduced
all denomination of notes to be reintroduced
- Advertisement -

మంగళవారం రాత్రి ప్రధాని నరేంద్ర మోదీ రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం కొత్తగా తయారుచేసిన రూ.500, రూ.2000నోట్లను విడుదల చేసి అందుబాటులోకి తీసుకొస్తున్నారు. ప్రస్తుతం రద్దు చేసిన రూ.1000 నోటు స్థానంలో త్వరలో కొత్త నోట్లను ప్రవేశపెట్టనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. అయితే మరికొన్ని నెలల్లో కొత్త డిజైన్‌తో మెరుగైన మార్పులు చేసి వెయ్యి రూపాయల నోటును కూడా విడుదల చేస్తామని ఆర్థికవ్యవహారాల కార్యదర్శి శక్తికాంతదాస్‌ గురువారం వెల్లడించారు.

das

కొద్దిసేపటి క్రితం మీడియాతో మాట్లాడిన వ్యవహారాల కార్యదర్శి శశికాంత్ దాస్ గుప్తా పలు కీలక విషయాలు పంచుకున్నారు. ప్రస్తుతం రద్దయిన రూ. 1000 నోట్ల స్థానంలో అదే డినామినేషన్ తో కూడిన కొత్త నోట్లను త్వరలో విడుదల చేయనున్నట్టు తెలిపారు. కొత్త నోట్లు ఎలా ఉండాలన్న విషయమై చర్చిస్తున్నామని, కొత్త సైజ్, కొత్త డిజైన్ లో ఉండే వీటిని త్వరలో ముద్రించి విడుదల చేస్తామని వెల్లడించారు.

చలామణిలో ఉన్న అన్ని రకాల కరెన్సీ నోట్లను ఉపసంహరించుకుని, వాటి స్థానంలో కొత్త డిజైన్, ఫీచర్లతో ఉండే కరెన్సీని ప్రవేశపెడతామని తెలిపారు. 5, 10, 20, 50, 100 రూపాయల కొత్త నోట్లు వస్తాయని స్పష్టం చేశారు. ప్రస్తుతం కరెన్సీ బట్వాడా శరవేగంగా సాగుతోందని, భద్రత నిమిత్తం 3 వేల మంది పారామిలిటరీ, పోలీసు, క్విక్ రియాక్షన్ టీములను ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు. వచ్చే సంవత్సరం 1 నుంచి జీఎస్టీ అమలు కానున్న నేపథ్యంలో కొత్త కరెన్సీ రావడం దేశ ఆర్థిక వ్యవస్థకు, పన్ను వసూళ్లకు అత్యంత కీలకమని ఆయన అన్నారు. లెక్కలోని రాని కోట్ల రూపాయల డబ్బును అలాగే వదిలేసి, దేశాన్ని ముందుకు తీసుకెళ్లాలన్న లక్ష్యంలో భాగంగానే నోట్ల రద్దు నిర్ణయం తీసుకున్నట్టు ఆయన వెల్లడించారు.

currency

- Advertisement -