Kavitha:కవిత అరెస్ట్ వెనుక..పెద్ద కుట్రే?

40
- Advertisement -

బి‌ఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత డిల్లీ లిక్కర్ స్కామ్ లో ఈడీ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో భాగంగా కవితపై మొదటి నుంచి కూడా ఈడీ ఏకపక్షంగానే వ్యవహరిస్తూ వచ్చింది. గతంలో పలుమార్లు కవితను విచారించిన విధానం, ఈడీ వ్యవహరించైన తీరు కేవలం రాజకీయ కోణంగానే కనబడుతూ వచ్చింది. స్వతంత్రంగా వ్యవహరించాల్సిన దర్యాప్తు సంస్థలు కేంద్రం చేతిలో కీలు బొమ్మగా మరి ప్రతిపక్ష పార్టీల నేతలే టార్గెట్ గా అరెస్టులు చేస్తూ వస్తోంది. కాగా ప్రస్తుతం ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవితా పాత్రపై ఈ కేసు కోర్టులో పెండింగ్ లో ఉంది. మరి ఒకవైపు కేసు కోర్టులో ఉన్నప్పటికి ఈడీ అరెస్టు చేయడం రాజ్యాంగ బద్దమేనా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఏదైనా కేసులో మహిళలను అరెస్ట్ చేసే సమయంలో సీఆర్పీసీ చట్టం ప్రకారం కొన్ని నిబంధనలు తప్పకుండా పాటించాల్సి ఉంటుంది…

జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ అనుమతి, వారెంట్.. వంటివి తీసుకోవడం, మహిళా భద్రత విషయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరించడం చేయాలి. కానీ ఇవేవీ పట్టించుకోకుండా ఎలాంటి వారెంట్ లేకుండానే కవితను అదుపులోకి తీసుకోవడం ముమ్మాటికి రాజ్యాంగ విరుద్దమే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అయితే పార్లమెంట్ ఎన్నికల ముందు కవితను అరెస్టు చేయడం.. ముమ్మాటికి మోడీ సర్కార్ కుట్రే అనేది మరికొందరు చెబుతున్న మాట.

రుజువులు లేని స్కామ్ లను ప్రతిపక్ష నేతలపై మోపి జైలు పాలు చేస్తే రాజకీయంగా లభ్ది పొందవచ్చేనే దురుద్దేశంతో బీజేపీ సర్కార్ వ్యవహరించిందనే చర్చ జరుగుతోంది. తెలంగాణ విషయంలో తరచూ చిన్నచూపు వహించే మోడీ సర్కార్.. లోక్ సభ ఎన్నికల్లో ఎలాగైనా మెజారిటీ సీట్లు సాధించాలనే ప్లాన్ లో ఉంది. అందులో భాగమనే బలమైన బి‌ఆర్‌ఎస్ పార్టీని దెబ్బ కొట్టేందుకు నిరాధార స్కామ్ లతో పార్టీ నేతలను జైలుకు పంపే ప్రయత్నం చేస్తోంది. అయితే బీజేపీ కుట్రలు రాష్ట్ర ప్రజలకు తెలియనివేమీ కాదు. ఏది ఏమైనప్పటికి ఎమ్మెల్సీ కవిత విషయంలో ఈడీ వ్యవహరించిన తీరు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశం అవుతోంది.

Also Read:వైసీపీ ఎంపీ అభ్యర్థులు వీరే….

- Advertisement -