75వ భారత స్వాతంత్ర్య వజ్రోత్సవాలు జరుపుకుంటున్న తరుణంలో దేశంలో ఇంటింటా తిరంగా పండుగ జరుపుకుంటుది. కానీ అలీగఢ్‌లో మాత్రం పాకిస్తాన్ జిందాబాద్ అనే నినాదాలు హోరెత్తాయి. ఉత్తరప్రదేశ్‌లోని అలిగఢ్‌లో తిరంగా యాత్రలో పాకిస్థాన్‌కు మద్దతుగా నినాదాలు చేసిన వీడియోలు బయటకు రావడంతో పలువురు విద్యార్థులపై పోలీసులు అభియోగాలు మోపారు. భారతీయ శిక్షాస్మృతిలోని సంబంధిత సెక్షన్ కింద వారిపై కేసులు నమోదు చేశారు. ఆగస్టు13న అలీగఢ్‌లోని ఒక కళశాల తిరంగా ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా కొందరు విద్యార్థులు పాకిస్థాన్‌కు అనుకూల నినాదాలు చేశారని ఆరోపిం
ఉరేగింపు వీడియోలతో కొందరు కళాశాల యాజమాన్యానికి ఫిర్యాదు చేశారు. అయిన ఫిర్యాదుపై కాలేజీ ఎలాంటి చర్యలూ చేపట్టకపోవడంతో పాటు ఈ వ్యవహారం బయటకు రాకుండా చూసిందని విమర్శలు వెల్లువెత్తాయి. ఆపై ఫిర్యాదు దారు సంబంధింత వీడియోలతో పోలీసులను ఆశ్రయించారు. కళాశాల ప్రిన్సిపాల్ మరియు మేనేజర్ కూడా ప్రభుత్వ సేవకుడు, సక్రమంగా ప్రకటించిన ఆర్డర్‌కు అవిధేయత చూపినందుకు నిందితులుగా చేర్చుకొన్నారు. ఇక ర్యాలీలో ముందు వరుసలో లెక్చరర్లు ఉన్నారని, పెద్దసంఖ్యలో విద్యార్ధులు పాల్గొన్న ర్యాలీలో అనూహ్యంగా పాకిస్తాన్ జిందాబాద్ అనే నినాదాలు వినిపించాయని, ఈ నినాదాలు ఎవరు చేశారో తెలియదని ర్యాలీలో పాల్గొన్న రజన్ కుమార్ అనే విద్యార్ధి మీడియాకు వెల్లడించారు.