బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ పేరు ఇప్పుడు ఎక్కువగా వార్తలలో నిలుస్తోంది. తాజాగా అలియా భట్ విలాసవంతమైన జీవనశైలిని.. ఆమె కార్ల సేకరణతోపాటు మిగతా విషయాల గురించి సెర్చ్ చేస్తున్నారు ఆమె ఫ్యాన్స్ అండ్ నెటిజెన్స్. సెర్చ్ చేయడమే కాదు.. రిజెల్ట్ చూసి షాక్ కూడా అవుతున్నారు వీళ్లు. నివేదికల ప్రకారం అలియా భట్ నికర విలువ దాదాపు 220 కోట్లు అట. అలాగే అలియా బ్రాండ్ ఎండార్స్‌మెంట్‌లు, ఇతర పెట్టుబడుల ద్వారా కూడా భారీగానే సంపాదిస్తోందట.
అంతేకాకుండా, అలియా భట్ విలాసవంతమైన కార్ల సేకరణతో పాటు అనేక ఖరీదైన వస్తువులను కూడా కలిగి ఉందట. అలాగే, అలియా భట్ కు కార్లు అంటే చాలా ఇష్టం. ఆమె వద్ద రేంజ్ రోవర్, మెర్సిడెస్ బెంజ్, ఆడి, BMW వంటి లగ్జరీ కార్లు ఉన్నాయి. మొత్తం వాటి విలువ 3 కోట్ల వరకు ఉంటుందని టాక్. ఇక రీసెంట్ గా అలియా భట్ తన లైఫ్ కు సంబంధించి చాలా డీటెయిల్స్ తన ఫ్యాన్స్ కు ఓపెన్ గా చెప్పేస్తోంది. తన వ్యక్తిగత విషయాల్ని, తన కాపురం సంగతుల్ని కూడా అలియా భట్ ఎప్పటికప్పుడు బయటపెడుతూ ఉంది.
అయితే, ఎన్ని విశేషాలు చెప్పినా, ఒకటి మాత్రం చూపించలేనంటోంది అలియా. తన బిడ్డకి సంబంధించిన ఆటపాటలను మాత్రం ఎవ్వరికీ చూపించనంటోంది అలియా భట్. తన బిడ్డ, ఇంట్లో చేసే అల్లరిని చూపించడం అలియా భట్ తనకు ఇష్టం లేదంటోంది. అందుకే, ఆ ఒక్కటి అడగొద్దు ప్లీజ్ అంటూ రిక్వెస్ట్ చేస్తోంది. బహుశా.. తన బిడ్డకు దిష్టి తగులుతుందని అలియా భట్ ఫీల్ అవుతుందేమో. అలియా భట్ కూతురు ‘రహా’ ఫోటోను రీసెంట్ గా రివీల్ చేసిన సంగతి తెలిసిందే.
Also Read:TTD:గణతంత్ర వేడుకలకు ఏర్పాట్లు పూర్తి