ఫన్నీ డ్యాన్స్‌తో ఆకట్టుకున్న అలియాభట్.. వీడియో

240
Alia Bhatt
- Advertisement -

కిడ్స్ ఛాయిస్ అవార్డ్సు 2017 కార్యక్రమంలో బాలీవుడ్ నటి అలియాభట్ తన డ్యాన్స్‌తో అందరినీ ఆకట్టుకుంది. ఈ ముద్దుగుమ్మ తమ్మా తమ్మా పాటకు స్టెప్పులేసింది. మేక్‌స్విప్ట్ లెగ్స్, పిల్లల కాస్ట్యూమ్స్‌తో చేతులను కాళ్లలా మార్చి ఈ పాటకు డ్యాన్స్ చేసి అందరినీ అలరించింది.

ఈ కార్యక్రమానికి హాజరైన నటుడు రణ్‌వీర్‌సింగ్, దర్శకుడు రోహిత్ శెట్టి అలియాభట్ ప్రదర్శనకు స్టన్ అయిపోయారు. స్టేజీపై ఉన్న డ్యాన్సర్లు, స్టేజి కిందున్న ప్రేక్షకులు అలియాభట్ ప్రదర్శనను ఆసక్తిగా తిలకించారు. ప్రస్తుతం అలియా చేసిన డ్యాన్స్ వీడియో నెట్టింట్లో వైరల్ మారింది.

- Advertisement -