అలియా భట్ ‘ఆల్ఫా’ ప్రభంజనం!

1
- Advertisement -

బాలీవుడ్ స్టార్ నటి అలియా భట్, శర్వరి వాగ్ ప్రధాన పాత్రల్లో నటించిన మోస్ట్ అవేటెడ్ స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘ఆల్ఫా’ బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే ఓపెనింగ్స్ సాధించింది. మొదటి ఫిమేల్ లీడ్ యాక్షన్ ప్యాక్డ్ సినిమాగా భారీ అంచనాలతో విడుదలైన ఈ చిత్రం మొదటి రోజే ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ. 15 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టి బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటింది.

శివ్ రవైల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం భారీ యాక్షన్ సీక్వెన్సులు, అలియా-శర్వరిల పవర్‌ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్‌తో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ చిత్రం మొదటి రోజు అన్ని భాషల్లో (హిందీ, తెలుగు, తమిళం) కలిపి సుమారు రూ. 8.50 కోట్ల నుండి రూ. 9 కోట్లు నెట్ వసూళ్లను సాధించినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ముఖ్యంగా మల్టీప్లెక్స్‌లు, ఏ నగరాల్లోని థియేటర్లలో ఈ సినిమాకు భారీ రెస్పాన్స్ లభించింది.

ప్రపంచవ్యాప్తంగా వసూళ్లు ఓవర్సీస్ మార్కెట్‌లో కూడా అలియా భట్‌కు ఉన్న క్రేజ్ కారణంగా సినిమాకు మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. భారత్ మరియు ఓవర్సీస్ కలెక్షన్లు అన్నీ కలుపుకుని మొదటి రోజు ముగిసేసరికి ప్రపంచవ్యాప్తంగా రూ. 15 కోట్ల మార్కును దాటింది. ‘ఏక్ థా టైగర్’, ‘టైగర్ జిందా హై’, ‘వార్’, ‘పఠాన్’, ‘టైగర్ 3’ వంటి భారీ బ్లాక్‌బస్టర్ సినిమాల తర్వాత యష్ రాజ్ ఫిల్మ్స్ (YRF) నిర్మించిన ప్రతిష్టాత్మక చిత్రం ‘ఆల్ఫా’. ఈ యూనివర్స్‌లో కేవలం మహిళా గూఢచారుల (ఫీమేల్ స్పేస్) కథాంశంతో వచ్చిన మొదటి సినిమా ఇదే కావడం విశేషం. అలియా భట్, శర్వరి ఇద్దరూ సూపర్ ఏజెంట్లుగా చేసిన యాక్షన్ స్టంట్స్ మరియు యాక్టింగ్ ప్రేక్షకులను థియేటర్ల వైపు రప్పిస్తున్నాయి. అనిల్ కపూర్ ఈ చిత్రంలో ఒక కీలక పాత్రలో కనిపించారు.

Also Read:E20 పెట్రోల్..మైలేజ్ తగ్గుతుందా?

మొత్తానికి అలియా భట్ తన విలక్షణ నటనతోనూ, లేడీ ఓరియెంటెడ్ యాక్షన్ సబ్జెక్ట్‌తోనూ మరోసారి బాక్సాఫీస్ వద్ద సత్తా చాటారు.

- Advertisement -