గ్రేటర్ ప్రజలకు అలర్ట్…

9
- Advertisement -

మరో నాలుగు రోజులు వర్షాలు దంచి కొడతాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ మేరకు ప్రజలు జాగ్రత్త వహించాలని… అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

భారీ వర్షాల నేపథ్యంలో నగరంలోని అన్ని జోన్లకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఈ నెల 8వ తేదీ వరకు వర్షాలు కురుస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. నిన్న కుత్బుల్లాపూర్ ప్రాంతంలో అత్యధికంగా 15.15 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా.. జూబ్లీహిల్స్ లో 12.4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. భారీ వర్షం కారణంగా నాలాలు పొంగిపొర్లాయి. రోడ్లపై నడుములోతునీరు పారింది.

భారీ వర్షం కురిసిన నేపథ్యంలో జీహెచ్ఎంసీ, హైడ్రా సిబ్బంది రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టారు. ప్రజలకు ఇబ్బంది లేకుండా అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని, లోతట్టు ప్రాంతాల్లో తగిన సహాయక చర్యలు చేపట్టాలని సూచించారు. వరద నీటి ప్రవాహం అధికంగా ఉన్న ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేయాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు.

Also Read:అడివి శేష్..’G2’రిలీజ్ డేట్

- Advertisement -