ఈ తెలుగు బ్యూటీ వాటికీ రెడీ!

49
- Advertisement -

బిగ్ బాస్ అలేఖ్య హారిక అచ్చ తెలుగు అమ్మాయి. కానీ, సోషల్ మీడియా హాట్ బాంబ్ గా అవతరించింది. ముఖ్యంగా ఈ సోషల్ మీడియా సెలబ్రిటీ అందాల ఆరబోత విషయంలో అసలు తగ్గడం లేదు. ఐతే, తనకు సినిమాల్లో అవకాశాలు రావడం లేదని, ఇదే విషయం పై అలేఖ్య హారిక ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. అలేఖ్య హారిక మాట్లాడుతూ.. ‘నేను యూట్యూబర్‌గా, సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్‌గా కొంత పాపులారిటీ తెచ్చుకున్నాను. కానీ, నేను సినిమా ఇండస్ట్రీకి వచ్చిందే హీరోయిన్ కావాలని. కానీ, సినిమాల్లో ఛాన్స్ లు రావడం చాలా కష్టం అయిపోయింది.

ఆరేళ్ళ ప్రయత్నాల తర్వాత కూడా నాకు సరైన అవకాశం రాలేదు. తెలుగు అమ్మాయిలకు అవకాశాలు తక్కువే అని ఇప్పటికే ఎంతోమంది చెప్పారు. అలేఖ్య హారిక కూడా ఓ తెలుగు అమ్మాయి కాబట్టి, అవకాశం ఇవ్వకూడదు అని కొందరు పని గట్టుకుని మరీ నన్ను బ్యాడ్ చేస్తున్నారు. అలాగే కొందరు దర్శకులు, కొందరు నిర్మాతలు కూడా తెలుగు అమ్మాయిలు అనగానే చిన్న చూపు చూస్తారు. పైగా ఇతర భాష హీరోయిన్లలా మన తెలుగు అమ్మాయిలు అవకాశాల కోసం ఎక్కువగా ప్రయత్నించరు అంటూ మా పై ఆరోపణలు చేస్తారు’ అంటూ అలేఖ్య హారిక చెప్పుకొచ్చింది.

Also Read:ఏమిటో.. ?ఈ దైవాంశ సంభూతుడు!

అలేఖ్య హారిక ఇంకా మాట్లాడుతూ.. ‘తెలుగు అమ్మాయిలకు ఛాన్స్ లు ఇస్తేనే ఇక్కడ వాళ్ళు కూడా సినిమా ఇండస్ట్రీలో బతుకుతారు. తెలుగు వాళ్ళు గ్లామర్ పాత్రలకు వ్యతిరేకం అంటుంటారు. కానీ నా విషయానికి వస్తే.. నేను గ్లామర్ పాత్రలకు వ్యతిరేకం కాదు. కానీ, నటనకు స్కోప్ ఉండే పాత్రలు అంటే నాకు చాలా ఇష్టం. ఆ పాత్రల కోసం ఎలాంటి గ్లామరస్ రోల్స్ కి అయినా, నేను రెడీ’ అంటూ అలేఖ్య హారిక తెలిపింది.

Also Read:జుట్టును సహజంగా కాపాడుకోండిలా..!

- Advertisement -