రొమాంటిక్, సస్పెన్స్ థ్రిల్లర్‌గా ‘అలకానంద’..

223
Alaknanda Movie is a Romantic and Suspense Thriller
- Advertisement -

కార్తికేయ మిరియాల ని దర్శకుడిగా పరిచయం చేస్తూ వి. బి . ఆర్ ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై ఈశ్వర్ రావు నిర్మిస్తున్న చిత్రం ” అలకానంద ” . భవికా దేశాయ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో రవి వర్మ హీరో కాగా తాగుబోతు రమేష్ , వెన్నెల కిషోర్ , విజయ్ సాయి , రఘు బాబు, నల్ల వేణు ప్రధాన పాత్రలు పోషించారు . తెలుగు , తమిళ , హిందీ బాషలలో ఈ చిత్రాన్ని ఏకకాలంలో నిర్మిస్తున్నారు . ఒక పాట , ఒక ఫైట్ బ్యాలెన్స్ మాత్రమే ఉన్న అలకానంద టాకీ పార్ట్ మొత్తం కంప్లీట్ చేసుకుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది.

Alaknanda Movie is a Romantic and Suspense Thriller

ఈ సందర్భంగా దర్శకులు మిరియాల కార్తికేయ మాట్లాడుతూ.. ” యుత్‌ని అలరించేలా సస్పెన్స్ థ్రిల్లర్‌తో పాటు రొమాంటిక్ ఎంటర్ టైనర్‌గా ఈ చిత్రాన్ని రూపొందించడం జరిగింది. కథ చెప్పిన వెంటనే మూడు బాషలలో నిర్మించడానికి ముందుకు వచ్చి నాకు అవకాశం ఇచ్చిన ఈశ్వర్ రావుకు కృతఙ్ఞతలు తెలుపుకుంటున్నాను.ఒక పాట,ఒక ఫైట్ మాత్రమే బ్యాలెన్స్ ఉన్నాయి. వాటిని కూడా ఈనెలలోనే కంప్లీట్ చేస్తాం. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు .

Alaknanda Movie is a Romantic and Suspense Thriller

నిర్మాత ఈశ్వర్ రావు మాట్లాడుతూ ” సస్పెన్స్ తో కూడిన రొమాంటిక్ చిత్రాలకు ప్రేక్షకాదరణ లభిస్తుండటంతో ఈ చిత్ర నిర్మాణానికి ముందుకు వచ్చాను . అలాగే దర్శకుడు చెప్పిన దాని కంటే బాగా సినిమాని తీశాడు. ఆల్రెడీ రష్ చూసుకున్నాం , తప్పకుండా హిట్ కొడతామన్న ధీమా ఉందన్నారు. శివ కాకాని సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి కళ్యాణ్ సమి ఛాయాగ్రహణం అందిస్తున్నారు.

- Advertisement -