అల వైకుంఠపురములో..100 కోట్లు వసూళ్లు..!

598
Allu Arjun
- Advertisement -

‘జులాయి’, ‘సన్నాఫ్‌ సత్యమూర్తి’ చిత్రాల తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌, స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో వచ్చిన మూడో చిత్రం ‘అల.. వైకుంఠపురంలో..’. ఈ సినిమాలో అల్లు అర్జున్‌కు జోడీగా పూజాహెగ్డే నటించింది. ఇటీవల విడుదలైన ఈ తాజా చిత్రం బాక్సాఫీస్‌ వద్ద భారీ వసూళ్లతో దూసుకుపోతోంది. తాజాగా ఈ మూవీ మరో రికార్డును క్రియేట్ చేసింది. బుధవారం మధ్యాహ్నం మ్యాట్నీ షోతో ఈ చిత్రం రూ. 100 కోట్ల గ్రాస్ ను రాబట్టిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

Ala-Vaikunthapurramuloo

ఈ మూవీ 12వ తేదీన విడుదల కాగా, తొలి మూడు రోజుల్లో 90 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. దర్బార్, సరిలేరు నీకెవ్వరు చిత్రాలతో పోటీ పడుతూ, ఇప్పటికీ నూరు శాతం ఆక్యుపెన్సీతో చిత్రం నడుస్తోందని సినీ వర్గాలు అంటున్నాయి. ఇక సినిమా థియేట్రికల్ (గ్లోబల్) హక్కులను రూ. 85 కోట్లకు విక్రయించగా, ఇప్పటివరకూ రూ. 60 కోట్లకు పైగానే షేర్ వచ్చిందని, మరో రెండు రోజుల్లో బ్రేక్ ఈవెన్ అవుతుందని సమాచారం.

- Advertisement -