అల వైకుంఠపురములో..ఆల్ టైం ఇండస్ట్రీ రికార్డ్

526
ala Vaikuntapuramlo
- Advertisement -

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో తెరకెక్కిన మూడవ చిత్రం అల..వైకుంఠపురంలో. పూజా హెగ్డే హీరోయిన్గా నటించగా..సుశాంత్, నవదీప్, టబులు కీలక పాత్రల్లో నటించారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్,, గీతా ఆర్ట్స్ బ్యానర్లపై అల్లు అరవింద్, చినబాబులు సంయుక్తంగా నిర్మించారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలైన ఈచిత్రం భారీ విజయాన్ని సాధించింది. కలెక్షన్ల పరంగా బాక్సాఫిస్ ను షేక్ చేస్తుంది. తాజాగా ఈమూవీ మరో రికార్డును క్రియేట్ చేసింది. ఆల్ టైమ్ ఇండస్ట్రీ రికార్డును సాధించింది.

ఈసందర్భంగా హైదరాబాద్ లో ఈమూవీ ధ్యాంక్స్ మీట్ ను నిర్వహించారు చిత్రయూనిట్. ఇప్పటి వరకు 19 రోజుల్లోనే ఈ చిత్రం 150 కోట్ల షేర్ వసూలు చేసి తెలుగు సినిమా కొత్త ఇండస్ట్రీ హిట్‌గా అవతరించింది. నాన్ బాహుబలిలో అన్ని రికార్డులను తన పేరు మీద రాసుకున్నాడు బన్నీ. నైజాం ఏరియాలో ఏకంగా రూ.40కోట్ల షేర్ వసూలు చేసి కొత్త రికార్డును సృష్టించింది. ఇక సీడెడ్‌ 19.25 కోట్లు.. ఉత్తరాంధ్ర 21.43 కోట్లు.. గుంటూరు 10.80 కోట్లు.. ఈస్ట్ 12.45 కోట్లు.. వెస్ట్ 8.72 కోట్లు.. కృష్ణ 10.40 కోట్లు.. నెల్లూరు 4.90 కోట్లు వసూలు చేసింది. ఏపీ తెలంగాణలో 125 కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది ఈ చిత్రం. ప్రపంచ వ్యాప్తంగా 150 కోట్ల షేర్ వసూలు చేసి నాన్ బాహుబలి రికార్డులను సొంతం చేసుకున్నాడు అల్లు అర్జున్.

- Advertisement -