నా పేరు సూర్య ..నా ఇల్లు ఇండియా తర్వాత అల్లు అర్జున్ చేసిన సినిమా అల వైకుకంఠపురములో. త్రివిక్రమ్ శ్రీనివాస్- బన్నీ కాంబినేషన్‌లో వస్తున్న హ్యాట్రిక్ కాంబో కావడం…విడుదలకు ముందే మ్యూజికల్ హిట్‌గా నిలిచిన ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. దాదాపు ఏడాది గ్యాప్ తర్వాత సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకువచ్చిన బన్నీ ఏ మేరకు ఆకట్టుకున్నాడు..?త్రివిక్రమ్ మార్క్ డైలాగ్‌లు ప్రేక్షకులను మెప్పించాయా లేదా చూద్దాం..
కథ:
బంటు (అల్లు అర్జున్) అంటే తన తండ్రి వాల్మీకి (మురళీ శర్మ)కి పడదు. తనకు కావాల్సింది ఇవ్వకపోవడం, సరిగ్గా చూడకపోవడం చేస్తూ ఉంటాడు. చిన్నప్పటినుండి అదే ఫ్రస్ట్రేషన్ తో పెరిగిన బంటు తన బాస్ (పూజ హెగ్డే)ను చూసి ప్రేమలో పడతాడు. సీన్ కట్ చేస్తే రామ చంద్ర బిజినెస్ పై కన్నేసిన విలన్ (సముద్రఖని) అతనిపై దాడి చేయిస్తాడు. ఈ క్రమంలో బన్నీకి ఓ నిజం తెలుస్తుంది..?బన్నీకి తెలిసిన నిజం ఏంటీ…?పూజా ప్రేమను ఎలా గెల్చుకున్నాడు..?అన్నదే అల వైకుంఠపురములో కథ.
ప్లస్ పాయింట్స్:
సినిమాలో మేజర్ ప్లస్ పాయింట్స్ అల్లు అర్జున్ నటన,పాటలు,ఫస్టాఫ్. తన నటనతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేశాడు బన్నీ. కామెడీ,ఎమోషన్స్,డ్యాన్స్,ఫైట్స్ ఇలా అన్నిరంగాల్లో కుమ్మేసిన బన్నీ తన కెరీర్‌లోనే బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. పూజ హెగ్డేకు నామ మాత్రపు పాత్ర దక్కగా మిగితా నటీనటుల్లో నివేతా పేతురాజ్, టబు,మురళి శర్మ ,సముద్రఖని,సునీల్ తమ పరిధిమేరకు ఆకట్టుకున్నారు. పాటలు సినిమాకే హైలైట్‌గా నిలిచాయి.
మైనస్ పాయింట్స్:
సినిమాలో మేజర్ మైనస్ పాయింట్స్ కథాంశం, సెకండాఫ్. చాలా సినిమాల్లో ఇలాంటి కథాంశం చూసిందే. సెకండాఫ్ లాగినట్లు అనిపిస్తుంది. సినిమా నేరేషన్ తగ్గితే బాగుండనిపిస్తుంది.
సాంకేతిక విభాగం:
సాంకేతికంగా సినిమా సూపర్బ్. విజువల్స్ స్టన్నింగ్‌గా ఉన్నాయి. సినిమాటోగ్రఫీ సూపర్బ్. సమజవరగమన,బుట్ట బొమ్మ పాటలే కాదు సీనరిస్ బాగున్నాయి. సంగీతంతోనే కాదు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ పరంగా కూడా మెప్పించాడు తమన్. ఎడిటింగ్ బాగుంది. అల్లు అరవింద్ నిర్మాణ విలువలకు వంకపెట్టలేం.
తీర్పు:
త్రివిక్రమ్ – బన్నీ కాంబినేషన్‌లో వచ్చిన హ్యాట్రిక్ కాంబో అల వైకుంఠపురములో. మధ్య తరగతి యువకుడికి నిజం తెలిసినప్పుడు అల వైకుంఠపురములో వచ్చిన తన సమస్యలను తీర్చుకుంటూ హీరో ఎలా ముందుకెళ్లాడనే కాన్సెప్ట్‌తో మూవీని తెరకెక్కించాడు త్రివిక్రమ్. కూల్ గా సాగిపోయే కథనం, సెకండ్ హాఫ్ లో వచ్చే ఎమోషనల్ ఎపిసోడ్స్ సినిమాకు ప్లస్ పాయింట్స్ కాగా విలనిజం లేకపోవడం, రొటీన్ కథనం మైనస్ పాయింట్స్. ఓవరాల్‌గా ఈ సంక్రాంతికి ఫ్యామిలీ అంతా కలిసి చూడదగ్గ ఆహ్లాదకర చిత్రం అల వైకుంఠపురములో.
విడుదల తేదీ:12/01/2020
రేటింగ్:3/5
నటీనటులు: అల్లు అర్జున్, పూజా హెగ్డే
సంగీతం: తమన్
నిర్మాతలు: అల్లు అరవింద్, ఎస్.రాధాకృష్ణ
దర్శకత్వం: త్రివిక్రమ్