అల్లు అర్జున్ “బుట్టబొమ్మ” మేకింగ్ వీడియో వైరల్

502
Allu Arjun
- Advertisement -

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం అల..వైకుంఠపురంలో. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈచిత్రంలో పూజా హెగ్డె హీరోయిన్ గా నటిస్తుంది. నిన్నటితో ఈమూవీ షూటింగ్ పూర్తయిందని తెలిపారు చిత్రయూనిట్. ఈమూవీకి సంబంధించిన ప్రతి అప్ డేట్ ను అభిమానులతో షేర్ చేసుకొనున్నట్లు ట్వీట్ చేశారు. ఇక ఈసినిమా టీజర్ తో పాటు నాలుగు పాటలను కూడా విడుదల చేశారు. ఈ సినిమాలోని పాటలకు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది.

తమన్ సంగీతం అందించిన ఈపాటలు యూట్యూబ్ లో ట్రెండింగ్ గా మారాయి. చివరగా బుట్టబొమ్మ అనే సాంగ్ ను విడుదల చేశారు. తాజాగా ఈపాటకు సంబంధించిన మేకింగ్ వీడియోను ట్వీట్టర్ లో పోస్ట్ చేసింది హీరోయిన్ పూజా హెగ్డె. బుట్టబొమ్మకు సాంగ్ కు సంబంధించిన స్పెషల్ సాంగ్ మీకోసం..ఎవ్వరికి చెప్పకండి అంటూ కామెంట్ చేసింది. ఈవీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కాగా సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈసినిమాను విడుదల చేయనున్నారు చిత్రయూనిట్. జనవరి 6న ఈమూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించనున్నట్లు ప్రకటించారు.

- Advertisement -