అల..వైకుంఠపురంలో..బుట్టబొమ్మ సాంగ్

624
Butta Bomma song
- Advertisement -

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం అల..వైకుంఠపురంలో. అల్లు అర్జున్ సరసన పూజా హెగ్డె కథానాయికగా నటిస్తోంది. ప్రస్తుతం ఈమూవీ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఇటివలే ఈమూవీ నుంచి రెండు పాటలు, టీజర్ ను విడుదల చేశారు చిత్రయూనిట్. ఈ చిత్రంలోని రెండు పాటలకు మంచి రెస్పాస్ వచ్చింది. యూట్యూబ్ లో ట్రెండింగ్ లో నిలిచాయి.

థమన్ సంగీతం అందిస్తున్న ఈచిత్రాన్ని గీతా ఆర్ట్స్, అండ్ హరీక , హసిని క్రియేషన్స్ సంస్ధ వారు నిర్మిస్తున్నారు. కాగా తాజాగా మరోసాంగ్ ను విడుదల తేదీని ప్రకటించారు చిత్రయూనిట్. ఈసినిమా నుంచి బుట్టబొమ్మ సాంగ్ టీజర్ ను ఈనెల 18న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈసందర్బంగా ఈపాటకు సంబంధించి ఓ పొస్టర్ ను కూడా విడుదల చేశారు. ఈసినిమాలో టబు, రాజేంద్ర ప్రసాద్, నవదీప్, రామ కృష్ణ కీలక పాత్రలు పోషించనున్నారు. కాగా ఈమూవీని సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల చేయనున్నారు. అల్లు అర్జున్ చాలా రోజుల తర్వాత నటిస్తోన్న చిత్రం కావడంతో ఈమూవీపై భారీగా ఆశలు ఉన్నాయి.

- Advertisement -