అల అమెరికాపురములో…ప్రొమో

131
thaman
- Advertisement -

సెన్సేష‌న‌ల్ కాన్స‌ర్ట్స్ ఏర్పాటుచేయ‌డంలో అగ్రగామిగా ఉన్న హంసిని ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ ఈ సంవత్సరం టాలీవుడ్ మ్యూజిక్ సెన్సేష‌న్ త‌మ‌న్ ను ‘అలా అమెరికాపురములో’ పేరుతో ఏర్పాటు చేసిన మ్యూజిక‌ల్ కార్నివాల్ అద్భుతమైన ప్రదర్శన కోసం అమెరికాకు తీసుకువస్తోంది. హంసిని ఎంట‌ర్‌టైన్‌మెంట్ వారు గతంలో స్టార్ మ్యూజిక్ డైరెక్ట‌ర్స్ ఏఆర్ రెహమాన్ మరియు అనిరుధ్ రవిచంద‌ర్‌ల‌తో కలిసి అతిపెద్ద మ్యూజిక్ కాన్సర్ట్స్ నిర్వహించారు.

ప్ర‌స్తుతం తమన్ అద్బుత‌మైన ఫామ్‌లో ఉన్నారు. స్టార్స్‌ మరియు సంగీత ప్రియులు ఎక్కువగా త‌మ‌న్ సంగీతాన్నే కోరుకుంటున్నారు. ఆగష్టు మరియు సెప్టెంబర్ నెల‌లో తమన్ యునైటెడ్ స్టేట్స్ లో పర్యటించనున్నారు. వాషింగ్టన్ డి.సి., చికాగో, న్యూజెర్సీ, శాన్ జోస్ మరియు డల్లాస్ లో ప్రత్యక్ష ప్రదర్శనలు ఇవ్వనున్నారు.

ఈ నేపథ్యంలో అల అమెరికాపురంలో కన్సర్ట్‌కు సంబంధించిన ప్రొమోను విడుదల చేశారు. తమన్ సంగీత బృందంలో శివమణి, నవీన్, ఆండ్రియా జెరెమియా, శ్రీ కృష్ణ, పృథ్వి చంద్ర, హరిక నారాయణ్, శ్రుతి రంజని, మనీషా, రోషిని, శాండిల్య, జోబిన్ డేవిడ్, సుభాశ్రీ, రాకేశ్ చారి, ఓషో వెంకట్, సిద్ధాంత్‌, ష‌దాబ్ రాయిన్ వంటి ప్రతిభావంతులైన ప్రదర్శనకారులు ఉన్నారు.

అల వైకుంఠపురములో సినిమాతో థమన్ సెన్సేషన్ సృష్టించాడు. ఆ సినిమాలో బాణీలకు అల్లు అర్జున్ స్టెప్స్ ప్రేక్షకుల్ని అనూహ్య రీతిలో అలరించాయి. ఇప్పుడు అదే అల్లు అర్జున్ ‘అల అమెరికాపురములో’ ప్రోమో విడుదల చేయటంతో అందరిలోనూ థమన్ యూఎస్ టూర్ పై ఆసక్తి నెలకొంది.

- Advertisement -