బండికి షాక్‌..బీజేపీలో అంతర్గత కుమ్ములాటలు

200
srivani
- Advertisement -

రంగారెడ్డి జిల్లా సరూర్ నగర్ డివిజన్ లోని బీజేపీ లో అంతర్గత కుమ్ములాటలు ఆ పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్‌కు కంటిమీద కనుకులేకుండా చేస్తున్నాయి. సరూర్ నగర్ డివిజన్ నుండి ఆకల శ్రీవాణి బీజేపీ తరపున బరిలో దిగి గెలుపొందగా ఆమె గెలిచిన కొన్ని నెలల తర్వాత జిల్లా పార్టీలో అంతర్గత కలహాలు , కుమ్ములాటలు , చివరికి దాడుల వరకు వెళ్లడం జరిగింది.

గతంలో కుడా జిల్లా నాయకత్వం కు , డివిజన్ నాయకులకు మధ్య సమన్వయ లోపం కొట్టొచ్చినట్లే కనబడి , బహిర్గతం అవ్వడం చర్చనీయాంశంగా మారింది.గతంలో సరూర్ నగర్ డివిజన్ కార్పొరేటర్ ఇంటిపై గుర్తుతెలియని దుండగులు దాడికి పాల్పడగా , వారు జిల్లా బీజేపీ నాయకుల పనే అని ఆరోపిస్తూ సరూర్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

పార్టీ పెద్దల సమక్షంలో రాజీ కుదర్చు కోగా కాస్త ప్రశాంతంగా ఉన్న సరూర్‌నగర్‌లో మళ్లీ అలజడి చేలరేగింది. సరూర్ నగర్ డివిజన్ కు చెందిన 50 మంది బీజేపీ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలోకి చేరడం తో , స్థానిక కార్పొరేటర్ మాట్లాడుతూ… డివిజన్ లో బీజేపీ బలం లేకుండా చేయాలని పార్టీ నాయకులు కంకణం కట్టుకున్నారని జిల్లా నాయకులు , మహేశ్వరం బీజేపీ నాయకులు శ్రీరాములు యాదవ్ పై విమర్శలు గుప్పించిన నేపథ్యంలో.., గుర్తు తెలియని వ్యక్తులు సరూర్ నగర్ కార్పెంటర్ ఇంటిపై రాళ్లతో దాడి చేయడం , రాళ్లతో దాడి చేసి కారు అద్దాలు ధ్వంసం చేసి దాడులకు పాల్పడ్డారని మండిపడ్డారు.

ఘటనకు సంబంధించిన సమాచారాన్ని స్థానిక పోలీసులకు తెలియజేయడం తో , ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు , చెదరగొట్టడం జరిగింది. ఇది పక్కా ప్రణాళికతో బీజేపీ జిల్లా , నియోజకవర్గ నాయకుల పనే అని , మాపై మూకుమ్మడిగా దాడికి పాల్పడుతున్నారన్న సమాచారం అందుకున్న గడ్డి అన్నారం డివిజన్ బీజేపీ కార్పొరేటర్ ప్రేమ్ మహేందర్ రెడ్డి , లింగోజి గూడ డివిజన్ కాంగ్రెస్ కార్పొరేటర్ దర్పల్లి రాజేశేకర్ రెడ్డి అడ్డుకోబోతే వారిపై కుడా దాడికి పాల్పడబోయారని , సొంత పార్టీ వారే మాపై ఇలా దాడులకు తెగబడితే , ఇక మా పరిస్థితి ఏమిటని సరూర్ నగర్ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి ఆవేదన వ్యక్తంచేశారు.

- Advertisement -