టీకాంగ్రెస్‌కు మరో షాక్..!

155
- Advertisement -

తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నేత, మల్కాజిగిరి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే ఆకుల రాజేందర్‌ కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో పార్టీని వీడాలని నిర్ణయించుకున్నట్లు ప్రకటన విడుదల చేశారు.

కౌన్సిలర్‌గా, సెంట్రల్‌ ఫిలిం సెన్సార్‌ బోర్డు సభ్యునిగా, 2009లో ఎమ్మెల్యేగా అవకాశం కల్పించిన ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీకి కృతజ్ఞతలు తెలిపారు. రాజీనామా ప్రతిని సోనియాగాంధీకి, పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డికి ఫ్యాక్స్‌, మెయిల్‌ ద్వారా పంపించినట్లు తెలిపారు.

- Advertisement -